జగన్‌ది నీచమైన జన్మ

share on facebook

మండిపడ్డ ఎంపి మురళీమోహన్‌

కాకినాడ,జూన్‌13(జ‌నం సాక్షి ): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్‌ రెడ్డి చేసిన ఆరోపణలకు టీడీపీ ఎంపీ మురళీమోహన్‌ కౌంటర్‌ ఇచ్చారు. జగన్‌ జన్మే నీచమైనదని అన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో లక్షల కోట్లు ఎలా సంపాదించారని మురళీమోహన్‌ ప్రశ్నించారు. జగన్‌ సీఎం అయితే రాష్ట్రాన్ని అమ్మేస్తారని ఆయన అన్నారు. తాను తప్పు చేసినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, నిరూపించకలేకపోతే రాజకీయాలు నుంచి జగన్‌ తప్పుకుంటారా? అని మురళీమోహన్‌ సవాల్‌ చేశారు. చర్చలకు ఎక్కడైనా సిద్ధమని, ఇడుపులపాయకైనా వస్తా…సవాల్‌కు సిద్ధమా? అంటూ మురళీమోహన్‌ మరోక్కసారి సవాల్‌ చేశారు.

 

Other News

Comments are closed.