జగన్‌వి వ్యక్తిగత ప్రయోజనాలు: టిడిపి

share on facebook

కడప,మే17(జ‌నం సాక్షి): ప్రతిపక్ష నాయకుడు జగన్‌ మోహన్‌రెడ్డి వ్యక్తిగత ప్రయోజనాల కోసం పూటకో మాట మారుస్తున్నాడని టిడిపి నాయకులు విమర్శించారు. ప్రధాని మోడీతో ప్రత్యేక¬దా కోసం డిమాండ్‌ చేశానని చెబుతున్నా అందులో నిజాయితీ కనిపించడం లేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు తుంగలో తొక్కిన బిజెపికి భవిష్యత్‌లో మద్దతు ఇవ్వబోనని తెలియచేయాలని అన్నారు. తరువాత తనపై ఉన్న కేసులు నిరూపణ అయినందున వీటి నుండి తప్పించుకునేందుకు తాను బేషరతులగా బిజెపికి మద్దతు ఇస్తానని చెప్పడం ఏమిటని  ప్రశ్నించారు.  వైకాపా నాయకులకు దమ్ముంటే రాజీనామాలను ఆమోదించుకుని ఎన్నికలకు రావాలని జిల్లా తెదేపా అధ్యక్షులు శ్రీనివాసులురెడ్డి సవాల్‌ విసిరారు. కర్ణాటక ఎన్నికల్లో భాజపా-వైకాపా దోస్తీ బహిర్గమైంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెదేపా అఖండ మైజార్టీతో గెలుస్తుంది. ఈ నెల 21న పులివెందులలో తెదేపా మినీ మహానాడు నిర్వహిస్తున్నామని అన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన కన్నా లక్ష్మీనారాయణ వైకాపాకు కోవర్టు అని.. జగన్‌కు సాయం చేయడానికే భాజపాలో చేరారని ఆరోపించారు. వైకాపాలో చేరుతానంటూ చెప్పి కన్నా లక్ష్మీనారాయణ ఇప్పుడు భాజపాలో చేరి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా గెలుస్తుందని కన్నా చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇదంత లోపాయకారి ఒప్పందమని తెలిపారు. కర్ణాటక ఎన్నికల్లో ఎంపీ విజయసాయిరెడ్డి భాజపా అభ్యర్థి యడ్యూరప్ప తరఫున ప్రచారం చేసిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయని అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి కేసులు, అక్రమ సంపాదన నుంచి బయట పడేందుకు భాజపాతో చేయి కలిపారని తెలిపారు. త్వరలో ఏపీలో జరిగే ఎన్నికల్లో భాజపాకు డిపాజిట్లు కూడా ఉండవన్నారు. నాలుగేళ్ల పాలనలో చంద్రబాబునాయుడు ఏపీని అన్ని విధాలా అభివృద్ధి పరిచారని చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డి ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. 2 వేల కిలోవిూటర్లు పాదయాత్ర చేసి ఏం సాధించారని ఎద్దేవా చేశారు. 12 కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్‌ పాదయాత్ర చేసి ప్రజలకు ఏం చెబుతారని ఆరోపించారు.

Other News

Comments are closed.