జగిత్యాలలో గులబీ జెండా ఎగురేస్తాం: సంజయ్‌

share on facebook

జగిత్యాల,సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి): జగిత్యాల నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురుతుందని, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సంజయ్‌కుమార్‌ ధీమా వ్యక్తం చేశారు. జగిత్యాలలో జీవన్‌రెడ్డిని ఈ సారి ఓడిస్తామని అన్నారు. అదికార పార్టీ అభ్యర్తఙ ఇక్కడ ఉండాలని ప్రజలు కోరుతున్నారని అన్నారు. మంత్రి కేటీఆర్‌, నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఇప్పటికే పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. మంత్రి కేటీఆర్‌కు గులాబీ జైత్రయాత్రను జగిత్యాల నుంచే ప్రారంభిస్తామని చెప్పారు. ఎంపీ కవిత సహకారంతో నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం ముందుకు వెళ్తున్న సమయంలో ప్రతిపక్షాలు రాద్దాంతం చేశాయనీ, ప్రతి పనిలోనూ తప్పు పడుతూ, కాకిగోల లాంటి విమర్శలకు దిగాయని మండిపడ్డారు. ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పి, ప్రజల్లో టీఆర్‌ఎస్‌కు ఎంతటి ఆదరణ ఉందో చాటేందుకే కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వచ్చారన్నారు. ఎంపీ కవిత నేతృత్వంలో జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలు గొప్పగా అభివృద్ధి సాధిస్తున్నాయన్నారు. నాలుగున్నర వేల డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల్లో నిర్మిస్తున్నారంటే కవిత కృషి ఎంత గొప్పగా ఉందో అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. బోర్నపెలి వంతెనకు రూ.70కోట్లు, రోళ్లవాగుకు రూ. 60కోట్లు సాధించామన్నారు. రానున్న ఎన్నికల్లో జగిత్యాల టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా తనను ను ఆశీర్వదించి, గొప్ప మెజార్టీతో గెలిపించాలని డాక్టర్‌ సంజయ్‌ కోరారు.

Other News

Comments are closed.