జనసేన ఇప్పటికీ ఎన్డీఏ మిత్రపక్షమే

share on facebook

– జమిలి దేశహితం కోసం కాదు
– మోడీ- అమిత్‌షా హితం కోసమే
– రాజ్యసభ డెప్యూటీ చైర్మన్‌ ఎన్నికలో వైసీపీ గౌర్హాజరైన బీజేసీకి సహకరించినట్లే
– అవినీతి లేదు కాబట్టే ఈజ్‌ఆఫ్‌ డూయింగ్‌లో ఫస్ట్‌ ర్యాంకు సాధించాం
– విలేకరుల సమావేశంలో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల
అమరావతి, జులై12(జ‌నం సాక్షి) : జనసేన ఇప్పటికీ ఎన్డీఏ మిత్రపక్షమే అని ఏపీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. గురువారం ఆయన అమరావతిలో విూడియాతో మాట్లాడారు.. వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి వెళ్తామని లెఫ్ట్‌ ప్రకటిస్తుందే తప్ప.. పవన్‌ కళ్యాణ్‌ ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేస్తున్నామని టీడీపీ ప్రకటించిన విధంగా జనసేన ఎందుకు ప్రకటించ లేదని ప్రశ్నించారు.  జనసేన ఇప్పటికీ ఎన్డీఏ మిత్రపక్షమే అని ఆరోపించారు. జమిలీ ఎన్నికల విధానం అమల్లోకి రావాలంటే ఐదు సవరణలు జరగాలన్నారు. ప్రస్తుతం మోదీ సర్కార్‌ ఆ సవరణలు చేసే పరిస్థితిలో లేదని యనమల పేర్కొన్నాడు. జమిలీ ఎన్నికలు దేశ హితం కోసం కాదు.. మోడీ-అమిత్‌ షా హితం కోసమే అని విమర్శించారు. రాష్టాల్ర అజెండా ప్రజల్లోకి వెళ్లకూడదని, ప్రాంతీయ పార్టీలను అణగదొక్కేందుకే జమిలీ ఎన్నికలకు బీజేపీ శ్రీకారం చుట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికల్లో బీజేపీకి సహకరించమని చెప్పిన వైసీపీ.. ప్రతిపక్షాలకు సహకరిస్తామని ఎందుకు చెప్పడం లేదని యనమల ప్రశ్నించారు. రాజ్యసభ డెప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికకు గైర్హాజరైనా.. బీజేపీకి వైసీపీ సహకరించినట్టే అని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రపంచం అంతా గుర్తిస్తోంది కానీ.. కళ్లుండీ ఈ ప్రతిపక్షాలు చూడలేకపోతున్నాయని ఎద్దేవా చేశారు. అవినీతి లేదు కాబట్టే ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ లో ఫస్ట్‌ ర్యాంక్‌ వచ్చిందని పేర్కొన్నారు. పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లల్లోనే పునాదులు వేశాం అని యనమల రామకృష్ణుడు అన్నారు.

Other News

Comments are closed.