జయరామ్‌ హత్యకేసులో పోలీసుల ప్రమేయం

share on facebook

విచారిస్తున్నామన్న డిసిపి
హైదరాబాద్‌,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి):  జయరాం హత్యకేసు దర్యాప్తును హైదరాబాద్‌ పోలీసులు వేగవంతం చేశారు. జయరాం హత్యలో ఐదుగురికి సంబంధం ఉన్నట్లు గుర్తించినట్లు వెస్ట్‌జోన్‌ డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులను మంగళవారం నుంచి విచారిస్తామని చెప్పారు. కేసులో దర్యాప్తు వివరాలను ఆయన విూడియాకు వివరించారు. రాజకీయ నేతలతో రాకేశ్‌కు సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోందని డీసీపీ పేర్కొన్నారు. రాకేశ్‌, శ్రీనివాస్‌ కాకుండా ఈ హత్యకేసులో మరో ఇద్దరు ఉన్నట్లు అనుమానిస్తున్నాం. నగేష్‌ అనే పేరు బయటికొచ్చింది. పోలీసుల ప్రమేయంపై కూడా విచారణ కొనసాగుతోందని డీసీపీ వివరించారు.

Other News

Comments are closed.