జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ

share on facebook

నిజామాబాద్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జిల్లాలో భారీగా బతుకమ్మ పండగను నిర్వహిస్తామని ప్రకటించారు. ఈనెల 26న హైదరాబాద్‌లోని గచ్చిబౌలీ స్టేడియంలో జరగబోయే రాష్ట్ర స్థాయి బతుకమ్మ వేడుకలకు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొంటారని జాగృతి మహిళా విభాగం ప్రకటించింది.తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుతూ బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. జిల్లాలో బతుకమ్మలకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.

బతుకమ్మ పండుగకు రాష్ట్రవ్యాప్తంగా భారీగా ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్‌ ఆదేశించడంతో జిల్లాలో కూడా జాగృతి ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఎంపి కవిత 20న ప్రారంభమయ్యే బతుకమ్మ పండుగతో పాటు 28 వరకు తొమ్మిది రోజులపాటు పలుప్రాంతాల్లో పాల్గొంటారని అన్నారు. 26న ఎల్బీ స్టేడియంలో బతుకమ్మ ఉత్సవాన్ని 35 వేల మందితో పెద్దఎత్తున నిర్వహించాలని నిర్ణయించినందున భారీగా మహిళలు హాజరవుతారని అన్నారు.

Other News

Comments are closed.