జిల్లాలో ఆనందోత్సాహాలతో రాఖీ పండుగ.

share on facebook

 

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆగష్టు 12(జనంసాక్షి):

రాఖీ పూర్ణిమ పండుగను జిల్లా వ్యాప్తంగా ఆనందోత్సాహాల తో ఘనంగా జరుపు కున్నారు.రాఖీ పౌర్ణమి సందర్భంగా గ్రామాల్లో ఆడపడుచులు వారి సోదరులకు రాఖీలు కట్టేందుకు ఉత్సాహాన్ని చూపడం జరిగింది.సుదూర ప్రాంతాల నుండి ఆడ పడుచులు తమ పుట్టిండ్లకు వచ్చారు. రెండు రోజులుగా ఆర్టీసి బస్సుల్లో రద్దీ వాతావరణం నెలకొంది.చిన్నారులు సైతం తమ సోదరులకు, ప్రజాప్రతినిధులకు రాఖీ లు కట్టారు.ఎంఎల్ఏ లు , స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

 

నాగర్ కర్నూల్ ఎంఎల్ఏ మర్రి కి రాఖీ కట్టిన సోదరి శ్రీమతి ఇందిర.:

నాగర్ కర్నూల్ నియోజకవర్గం ఎంఎల్ఏ మర్రి జనార్ధన్ రెడ్డి కి తమ సోదరి ఇందిర రాఖీ కట్టింది.ఈ సందర్భంగా మర్రి జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో అనుబంధాలకు ప్రథమ ప్రాధాన్యత నిచ్చారని అన్నా చెల్లెలు అక్క తమ్ముళ్ల అనుబంధానికి రాఖీ పౌర్ణమి నిదర్శన మన్నారు.ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ నియోజకవర్గ ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

రాఖీ పౌర్ణమి సందర్బంగా టీపీసీసీ ఉపా అధ్యక్షులు సీనియర్ నాయకులు మల్లు రవి కి, ఏఐసీసీ జాతీయ ఓబీసీ కోఆర్డినేటర్, తమిళనాడు ఇంచార్జ్ కేతూరి వెంకటేష్ కు , కొల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతలపల్లి జగదీశ్వర్ రావు కు రాఖీ కట్టిన కాటామోని తిరుపతమ్మ గౌడ్ రాఖీ కట్టడం జరిగింది.

ప్రేమనుబంధాలకు ప్రతీక రక్షా బంధన్: మాజీ మంత్రి జూపల్లి.:
రక్షా బంధన్ సందర్భంగా కొల్లాపూర్ పట్టణంలో మాజీ మంత్రి జూపల్లికి ఆయన క్యాంప్ కార్యాలయంలో కౌన్సిలర్ మేకల రమ్య నాగరాజు రాఖీ కట్టి వారికి రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ రక్షా బంధన్ మీ విజయనికి నాంది పలకాలి అని వారు కోరుకున్నారు.ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ కొల్లాపూర్ నియోజకవర్గంలోని అందరూ సోదర,సోదరి భావంతో మెలుగుతూ ఎల్లప్పుడూ ప్రేమ, అనూరాగలతో ఉండాలనీ కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

శుభాకాంక్షలు తెలిపిన ఎంఎల్ఏ భీరం.:
రాఖీ పండుగ సందర్భంగా కొల్లాపూర్ నియోజకవర్గం ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.నియోజక వర్గం లో ప్రజలు సోదరీ సోదర భావంతో ప్రేమానురాగాలతో మెలగాలని కోరారు.

Other News

Comments are closed.