జీతాల చెల్లింపులో గుత్తేదారుల చేతివాటం

share on facebook

నిమ్స్‌ సెక్యూరిటీ గార్డుల ఆందోళన

హైదరాబాద్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): నిమ్స్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్న ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డులు సెక్యూరిటీ కార్యాలయం ముందు బైఠాయించి మంగళవారం ఆందోళనకు దిగారు. గతంలో పనిచేసిన గుత్తేదారు ఒక నెల వేతనం, నూతనంగా వచ్చిన గుత్తేదారు ఒక నెల వేతనాన్ని చెల్లించడంతో తాత్సారం చేస్తున్నారని వాపోయారు. రోజూ గంటల తరబడి నిలబడే ఉండి విధులు నిర్వహిస్తున్నా.. తమపట్ల గుత్తేదారులు నిర్దయగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 25 రోజులుగా నిమ్స్‌ ఉన్నతాధికారులకు, పాత గుత్తేదారుకు తమ సమస్యలను వివరించినా పరిష్కారం కాలేదన్నారు. పేదరికంలో ఉన్న తాము ఇంటి యజమానులకు అద్దెలు చెల్లించకపోవటంతో వారు ఇంటిని ఖాళీ చేయాలని హెచ్చారిస్తున్నారని వాపోయారు. ఈ విషయంపై ఇంతకు ముందు పనిచేసిన గుత్తేదారు మురారీ గౌడ్‌ను వివరణ కోరగా తమకు నిమ్స్‌ యజమాన్యం నుంచి నాలుగు నెలల నగదు చెక్కులు అందాల్సి ఉందని.. అవి అందిన వెంటనే సెక్యూరిటీ గార్డులకు బకాయిపడ్డ వేతనాన్ని అందజేస్తానని తెలిపారు.

 

 

Other News

Comments are closed.