జూరాల నీటినిల్వలపై ఆందోళన

share on facebook

నీటి విడుదలకు రైతుల ఎదురుచూపు
మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో ఉన్న నిల్వలు ఆందోళన కలిగిస్తున్నాయి. మరో రెండు నెలలపాటు తాగునీటి అవసరాలకు సరిపోతాయా అన్న అనుమానాలు ఉన్నాయి. ఈ దశలో ఆయకట్టు చివరి భూముల రైతులు కూడా నీటి విడుదల చేసి పంటలను కాపాడాలని
కోరుతున్నారు. ఉన్న నీటిని పరిగణనలోకి తీసుకొని సాగునీటి అవసరాలను తీర్చడంపై పీజేపీ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. చివరివిడత కింద మరోమారు ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేస్తే రామన్‌పాడ్‌, జమ్ములమ్మ, గోపాల్‌దిన్నె జలాశయాలపై ఆధారపడిన తాగునీటి పథకాలపై ఏర్పడే
ప్రభావాన్ని పీజేపీ అధికారులు ఉన్నతాధికారులకు నివేదించారు. నిల్వనీటిలో రోజుకు 112 క్యూసెక్కుల
నీరు ఆవిరవుతోంది. కృష్ణానది ఎగువప్రాంతం నుంచి కేవలం ఎనిమిది క్యూసెక్కుల వూటనీరు మాత్రమే ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు ప్రధాన కుడి, ఎడమ కాలువలతోపాటు భీమా, కోయిలసాగర్‌, నె/-టటెంపాడు ఎత్తిపోతల పథకాలకు నీటి విడుదలను పూర్తిగా నిలిపివేశారు. సంగంబండ జలాశయం
నుంచి ఆశించిన మేరకు నిల్వనీరు జూరాల ప్రాజెక్టుకు చేరలేకపోవడం వల్ల ఇప్పటికీ జూరాల ఆయకట్టు కింద చివరి విడతగా సాగునీటిని విడుదల చేయడంలో ఆందోళనకర పరిస్థితే ఉందన్నారు. ఇందుక
నుగుణంగా భీమా అధికారులు చర్యలు తీసుకున్నా కనీసం అర టీఎంసీ నీరు కూడా జూరాల ప్రాజెక్టుకు చేరలేదన్నారు. ప్రాజెక్టులో నీటిమట్టం కనీసం విూటరు మేరకు పెరిగినా ఆయకట్టు కింద కోతదశలో ఉన్న వరిపంటకు పూర్తిస్థాయిలో సాగునీటినందించే పరిస్థితి ఉండేదన్నారు. ప్రస్తుత పరిస్థితిని
ఉన్నతాధికారు లకు నివేదించామని, వారి ఆదేశాల మేరకు నిర్ణయం ఉంటుందన్నారు. జూరాల ప్రాజెక్టు కింద యాసంగిలో సాగు చేసిన వరిపంటకు సాగునీటి కష్టాలు గట్టిక్కినట్లేనని ఆయకట్టు రైతులు భావిస్తున్న పరిస్థితుల్లో చివరివిడతగా న కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేయడంపై పీజేపీ
అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఎగువన ఉన్న సంగంబండ జలాశయం నుంచి భీమా అధికారులు నిల్వనీటిని విడుదల చేసిన క్రమంలో ఆయకట్టు కింద సాగుచేసిన వరిపంటకు మరో రెండు విడతలు సాగునీటిని సమకూర్చ నున్నామని పీజేపీ అధికారులు ప్రకటించారు. దీంతో ఆయకట్టు కింద
వరిపంట వేసిన రైతుల్లో ధీమా ఏర్పడింది.

Other News

Comments are closed.