జైట్లీ మరణవార్తతో ఢిల్లీ వెళ్లిన అమిత్‌ షా

share on facebook

హైదరాబాద్‌,ఆగస్ట్‌24 (జనంసాక్షి): హైదరాబాద్‌ పర్యటనలో ఉన్న కేంద్ర ¬ంమంత్రి అమిత్‌ షా తన పర్యటనను మధ్యలోనే ముగించుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత అరుణ్‌ జైట్లీ మరణించిన వార్త అందుకున్న వెంటనే హుటాహుటిన ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. మరోవైపు, అరుణ్‌ జైట్లీ మరణవార్తతో బీజేపీ నేతలు ఆవేదనలో మునిగిపోయారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఎయిమ్స్‌ ఆసుపత్రి వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. బిజెపికి చెందిన ప్రముఖ నేతలుకూడా ఢిల్లీ బయలుదేరారు. ¬ంశౄఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లారు.

Other News

Comments are closed.