జోరుగా టిఆర్‌ఎస్‌ ఉప ఎన్నిక ప్రచారం

share on facebook

ఊరూరా ప్రచారంలో పాల్గొంటున్ననేతలు
నల్లగొండ,అక్టోబర్‌7 ( జనం సాక్షి ) : హుజుర్‌నగర్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డికి మద్దతుగా జోరుగ ఆప్రచారం సాగుతోంది. వివిధ గ్రామాల్లో ఎక్కడిక్కడేఉ టిఆర్‌ఎస్‌ వ్రేణులు పరచారం చేస్తున్నారు.  మేళ్లచెరువు మండలంలోని పలు తండాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. కప్పలకుంట తండా, యతీరాజుపురం తండా, కల్వలపల్లి తండాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రి సత్యవతి రాథోడ్‌, ఉప ఎన్నిక ఇంఛార్జ్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కారుగుర్తుకే ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారం ధూంధాంగా సాగుతోంది.  కోలాటాలు, బతుకమ్మలు, బోనాలతో టిఆర్‌ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డికి ఘన స్వాగతం పలుకుతున్నారు. గిరిజన బిడ్డనైన నాకు సీఎం కేసీఆర్‌ మంత్రి పదవి ఇచ్చారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో తండాలన్నీ టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలపాలి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి సత్యవతి రాథోడ్‌ పిలుపునిచ్చారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే. హుజురనగర్‌ ఉప ఎన్నికలో గిరిజన బిడ్డలు టీఆర్‌ఎస్‌కు మద్దతివ్వాలి. తండాల సమస్యలను ఉత్తమ్‌ పట్టించుకోలేదు. కాంగ్రెస్‌కు ఓటేస్తే ఉత్తమ్‌కు లాభం. టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే హుజుర్‌నగర్‌ ప్రజలకు లాభం అని ఆమె పిలుపునిచ్చారు.  హుజుర్‌నగర్‌ ఎన్నికల్లో ఉత్తమ్‌కు ఓటమి తప్పదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి అన్నారు.  టీఆర్‌ఎస్‌కు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోంది. సైదిరెడ్డి గెలుపు ఎప్పుడో ఖాయమైందని ఎంపి బడుగుల లింగయ్య యాదవ్‌ అన్నారు.  తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసి, రాష్టాభ్రివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసున్న మంత్రి కేటీఆర్‌ను విమర్శించే స్థాయి, అర్హత ఉత్తమ్‌ కుమార్‌రెడ్డికి లేవని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌ అన్నారు.కేటీఆర్‌ రోడ్‌ షో తర్వాత కాంగ్రెస్‌ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. ఉప ఎన్నికల్లో ఇక సైదిరెడ్డి గెలుపు నల్లేరు విూద నడకేనన్నారు. దేశంలో బలహీన వర్గాల ప్రజలకు, ఉన్నత వర్గాల పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఏకైక సీఎం కేసీఆర్‌ మాత్రమే అన్నారు. గత పదేళ్లుగా హుజూర్‌నగర్‌కు ప్రజా ప్రతినిధిగా ఉన్న ఉత్తమ్‌ హైదరాబాద్‌లో ఏసీ రూముల్లో ఉంటూ నియోజకవర్గానికి చుట్టపు చూపుగా వచ్చి ప్రజా సమస్యలను గాలికి వదిలేసాడని మండిపడ్డారు. నియోజకవర్గంలో ఏ మూలకు వెళ్లినా రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని వాటిని చూస్తేనే ఉత్తమ్‌ చేసిన అభివృద్ధి ఏంటో తెలుస్తుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పా ర్టీ అధికారంలో ఉన్నందున నియోజకవర్గ ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని కోరారు.

Other News

Comments are closed.