జోరుగా వర్షాలు..

share on facebook

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురు..

మూడురోజులుగా ముసురుతో కూడిన వర్షాలు ..

మండలంలో పలుచోట్ల ఉప్పొంగుతున్న వాగులు..

మహాముత్తారం ఆగస్టు 20 (జనం సాక్షి) మండలంలోని మూడురోజులుగా ముసురు తో కూడిన వర్షాలు కురుస్తున్నాయి .గ్రామంలో చెరువులు. కుంటలు. జలకళను సంతరించుకున్నాయి.వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.పెద్దపెద్ద చెరువుల వద్ద మత్తళ్లు పొస్తున్నాయి .అత్యధిక వర్షపాతం శుక్రవారం నమోదయింది.అల్పపీడనం బలపడిన కారణంగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు కనక నూర్. రెడ్డి పెళ్లి. సింగంపల్లి .గ్రామాలకు రవాణా సౌకర్యాలు శనివారం నుంచి నిలిచిపోయాయి.గ్రామాల సమీపంలోని వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో రవాణా పూర్తిస్థాయిలో నిలిచిపోయాయి.దొబ్బల పాడు.దౌతు పెళ్లి. కేశవపూర్.పోలారం.నల్ల గుంట మినజి పేట.వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయులకు పాఠశాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది .రోజుల్లో ఎక్కువ టైం ముసురు పడటం అప్పుడప్పుడు భారీ వర్షం పడటం మూడు రోజులుగా జరుగుతుంది .ఎడతెరపిలేకుండా వర్షాలు కురియడంతో సీజన్లోఇదే భారీ వర్షం .ఇప్పటివరకు మండలంలో 40 శాతం కూడా రైతులు నాట్లు పడలేదు వర్షం మూలంగా కుంటలకు. చెరువు.లకు నీరు చేరుకోవడంతో రైతులు ఆనందపడుతున్నారు .ముసురు  మూలంగా రోడ్లన్నీ బురదమయం అవుతున్నాయి .మరో రెండు రోజులపాటు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో మండలంలోని అడవి గ్రామాల ప్రజలకు జాగ్రత్తగా ఉండాలని .మండల అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు .మండలంలోని రెవెన్యూ. పోలీస్ .అధికారులు ఎప్పటికప్పుడు వర్షాల పరిస్థితిని గ్రామాల నుంచి సమాచారం అందించేందుకు v r o. వీఆర్ఏ లను .అప్రమత్తంగా ఉంచినట్లు ఇంచార్జ్ తాసిల్దార్. ముక్తార్ పాషా . తెలిపారు.  జిల్లా కేంద్రానికి సమాచారం అందిస్తున్నట్లు తెలిపారు .వర్షంతో గ్రామాలలో ప్రమాదాలు జరగకుండా ప్రజలు జాగ్రత్తపడాలని వారు తెలిపారు .

Other News

Comments are closed.