టిఆర్‌ఎస్‌కు పలువురు రాజీనామా

share on facebook

జయశంకర్‌ భూపాలపల్లి,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ): తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ఉద్యమించిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఉద్యమకారులు ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పారు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి అహర్నిశలు కష్టపడి పనిచేసినా పార్టీలో సరైన ప్రాధాన్యత లేకపోవడం, కొంతకాలంగా వివిధ పార్టీల నుంచి వచ్చి టీఆర్‌ఎస్‌లో చేరిన వారి ప్రాబల్యం పెరగడంతో విసిగిపోయిన ఉద్యమకారులు టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. మండల కేంద్రంలోని శ్రీరామగౌతమి డిగ్రీ కళాశాల ఆవరణలో ఉద్యమకారులు సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఉద్యమ నాయకుడు పూనెం రాంబాబు మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమం సమయంలో వ్యతిరేకంగా పనిచేసిన వారు టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే పార్టీలో చేరి తామే ఉద్యమ నాయకులమని చెప్పుకుంటున్నారన్నారు. /ఖంతో అసలైన ఉద్యమ నాయకులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా… ఉద్యమ నాయకులు మండల కేంద్రంలో ప్లెక్సీలు చేబూని మౌన ప్రదర్శన నిర్వహించారు. ఈ సమావేశంలో ఉద్యమ నాయకులు పూనెం రాంబాబు, ఎస్కే.ఖాజావళి, బొ/-లలె ధనార్జునరావు, యాలం సుబ్బయ్య, వాసం ఆనందరావు, ప్రకాష్‌, కోటేశ్వరరావు, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

——

Other News

Comments are closed.