టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా విపక్షాల ఐక్యతా రాగం

share on facebook

కలసి పనిచేస్తే విజయం తమదే అన్న భావన

పొత్తులపై స్పష్టత వస్తేనే ఎవరు ఎక్కడ తేలేది

ఖమ్మం,సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి): ఖమ్మం జిల్లాలో టిఆర్‌ఎస్‌ను ఢీకొనాలంటే కలసికట్టుగా వెలితే తప్ప సాధ్యం కాదని కాంగ్రెస్‌ నేతుల భావిస్తున్నారు. ఉభయకమ్యూనిస్టులతో పాటు, న్యూడెమక్రసీ లాంటి వారి మద్దతుతో ముందుకు సాగాలన్న అభిప్రాయం వస్తోంది. మంత్రి తుమ్మల బలమైననేతగా వ్యూహాల్లో ఉన్నారు. ఇక్కడి నుంచి ప్రతిసారీ కమ్యూనిస్టుల్లో ఐక్యత సాధించడం లేదు. విూటింగ్‌లలో ఐక్యత అంటారు. ఎన్నికల్లో విడిగా పోటీ పడతారు. ప్రణాళికాబద్ధంగా ప్రచారం నిర్వహించి గెలుపు దిశగా అడుగులు వేయాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. మరోవైపు టిఆర్‌ఎస్‌ కూడా మల్లీ విజయం కోసం వ్యూహాలు పన్నుతోంది. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం వేదికగా మధిర నియోజకవర్గం పరిధిలోని మండలాల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు, ముఖ్య నేతలతో సమావేశాలు కొనసాగుతున్నాయి. మధిర అభ్యర్థి లింగాల కమల్‌రాజ్‌, ఎంపీ పొంగులేటి తదితర నేతలు హాజరయ్యారు. ఇల్లెందు అభ్యర్థి కోరం కనకయ్య కామేపల్లి మండల కేంద్రంలో స్థానిక నేతలు, కార్యకర్తలతో మాట్లాడారు. గెలుపునకు సహకరించాలని కోరారు. అశ్వారావుపేట అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు చంద్రుగొండ, అన్నపురెడ్డిపల్లిలో ద్విచక్ర వాహన ర్యాలీ చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, వైరా అభ్యర్థి బానోతు మదన్‌లాల్‌ వైరాలో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. సత్తుపల్లి అభ్యర్థి పిడమర్తి రవి, డీసీసీబీ ఛైర్మన్‌మువ్వా విజయ్‌బాబు తదితరులు కూడా క్షేత్రస్థాయిలో సమావేశం నిర్వహించారు. పలువురు నేతలతో చర్చలు కొనసాగించారు. భద్రాచలం అభ్యర్థి డా.తెల్లం వెంకటరావును పలువురు నేతలు, కార్యకర్తలు కలిశారు. దీంతో ఉభయ జిల్లాల్లోని సీపీఐ నేతలలో ఆసక్తి రేకెత్తించింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ మధ్య కూడా పొత్తుల ప్రస్తావన వచ్చింది. వీరితోపాటు తెతెదేపా తెజసతోనూ సంప్రదింపులు నిర్వహించే ఆలోచనలో ఉంది.వీటిలో 2 నియోజకవర్గా లపై మాత్రం ఎలాంటి ఉత్కంఠ లేదనే చెప్పొచ్చు. మధిర స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, సత్తుపల్లి నుంచి మాజీ సండ్ర వెంకటవీరయ్య ఉండటంతో ఈ రెండు స్థానాలూ ఆయా పార్టీలకే దక్కుతాయనడంలో ఎలాంటి సందేహంలేదు. మిగతా వాటి విషయం తేలితేనే ప్రచారం మరింత వేడెక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పొత్తుల్లో భాగంగా వైరా స్థానాన్ని సీపీఐకి కేటాయించ వద్దని కాంగ్రెస్‌ ఆశావహుడు రాములునాయక్‌, అయిదు మండలాల కాంగ్రెస్‌ నేతల ఆధ్వర్యంలో గాంధీభవన్‌ ఎదుటఆందోళన నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి వినతి పత్రం అందించారు. 2014 సాధారణ ఎన్నికల సమయంలోనూ సీపీఐకే టికెట్‌ ఇచ్చారని, మళ్లీ వచ్చే ఎన్నికల్లో పొత్తుల పేరిట సీటు ఆ పార్టీకి ఇవ్వవద్దని నేతలు కోరారు. మొత్తంగా కలసి వెలితే కలసివస్తుందన్న బావన నేతల్లో ఉంది.

Other News

Comments are closed.