టిఆర్‌ఎస్‌ అభ్యర్థులనే గెలిపించాలి

share on facebook

ప్రచారంలో ఎమ్మెల్యే రాజయ్య పిలుపు
జనగామ,మే4(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమని, జెడ్పీటీసీతోపాటు మండలంలోని 12 ఎంపీటీసీ స్థానాల్లో గులాబీ జెండాఎగురవేయాలని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య అన్నారు. ఎన్నికల ప్రచారలో ఆయన పస్రజలను కలసి ఓట్లు అభ్యర్థించారు. మండలంలోని అన్ని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ బలపరిచిన అ భ్యర్థులను గెలిపించుకుని, గులాబీ జెండా ఎగురవేయాలన్నారు. సర్పంచ్‌ ఎన్నికల్లో మండలంలోని అన్ని గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను
గెలిపించుకున్నామని, అదే స్ఫూర్తితో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలన్నింటినీ గెలిపించుకోవాలని రాజయ్య కోరారు. పార్టీలో క్రమశిక్షణ, విధేయత కల వారికి తగిన ప్రా ధాన్యం, గుర్తింపు తప్పక ఉంటుందన్నారు. టికెట్లు ఆశించిన వారు చాలా మంది ఉన్నారని, వారందరికీ ఇవ్వలేమని, అ లాంటి వారికి పార్టీ పదవులు, అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యులను చేసి జిల్లా, రాష్ట్ర స్థాయి నామినేటేడ్‌ పదవులతో గౌరవిస్తామని అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులుగా అధిష్టానం ప్రకటించిన వారిని గెలిపించేందుకు ప్రతీ కార్యకర్త కంకణ బద్ధులై కృషి చేయాలని రాజయ్య కోరారు. టీఆర్‌ఎస్‌ పార్టీలో పని చేస్తున్న ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని, ప్రతీ ఒక్కరికీ అవకాశం, అర్హతను బట్టి తగిన ప్రాధాన్యం ఉంటుందన్నారు. పార్టీ లో ఉంటూ ద్రోహం చేసే వారిని ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

Other News

Comments are closed.