టిఆర్‌ఎస్‌ గెలుపుతో సత్తా చాటుతాం: ముత్తిరెడ్డి

share on facebook

జనగామ,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపు ఖాయమని మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డియాదగిరిరెడ్డి అన్నారు. టిఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపుకోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయి, నాలుగేళ్లుగా నియోజకవర్గాన్ని పట్టించుకోని పొన్నాల లక్ష్మయ్య ఇప్పుడ ప్రచారానికి రావడం విడ్డురంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజలకు అమలు చేస్తున్న పథకాలే పార్టీని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి టీఆర్‌ఎస్‌, తన గెలుపు కోసం యువత సైనికుల్లా పని చేయాలని అన్నారు. గెలుపుతో ప్రతిపక్షాలకు డిపాజిట్‌ గల్లంతు కావడం ఖాయమన్నారు. మరోవైపు ప్రచార¬రుతో జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీలో నయాజోష్‌ నెలకొంటోంది. ఊరురా పార్టీలో భారీగా చేరడంతోపాటు టీఆర్‌ఎస్‌కే ఓటు వేసి గెలిపిస్తామని ప్రజలు ప్రకటిస్తున్నారు. గడచిన నాలుగున్నరేళ్లలో టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం చేసిన అభి వృద్ధిపై చర్చించు కుంటున్నారు. సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పెద్దసంఖ్యలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతు న్నారు. జిల్లాలో రోజురోజుకు కారెక్కె వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. పాలకుర్తి, జనగామ నియోజకవర్గాలకు చెందిన ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎక్కువ సంఖ్యలో గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ప్రధానంగా పాలకుర్తి నుంచి భారీగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. స్టేషన్‌ ఘన్‌ పూర్‌ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య రెట్టించిన ఉత్సాహంతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

Other News

Comments are closed.