టిఆర్‌ఎస్‌ పార్టీ బంగారు తెలంగాణను భ్రమల తెలంగాణ చేశారు

share on facebook

– కాంగ్రెస్‌ మేనిఫెస్టోను తూచా తప్పకుండా పాటిస్తుంది

– కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు బి సంతోష్‌

వీర్నపల్లి నవంబర్‌ 19 (జనంసాక్షి):మండల కేంద్రంలోని భావుసింగ్‌ తండా గ్రామ పంచాయతీలోని భానోత తండాలో కాంగ్రెస్‌ ఇంటింటా ప్రచారం మండల అధ్యక్షుడు భూత శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జరిగింది.ఈ సందర్భంగా ఎస్టీ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు బిసంతోష్‌ మాట్లాడుతూ టిఆర్‌ఎస్‌ పార్టీ గిరిజనులకు చేసిన అభివృద్ధి ఏమి లేదని తండాలు గ్రామ పంచాయతీగా చేసి ఇప్పటివరకు తండాలలో మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని,తండాలలో బాత్రూములు కట్టి వాటి డబ్బులు టిఆర్‌ఎస్‌ నాయకుల జేబులో వేసుకున్నారే తప్ప లబ్దిదారులకు ఇవ్వలేదన్నారు. టిఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు బంగారు తెలంగాణను చేస్తానని అన్నారు కానీ ఇది భ్రమల తెలంగాణ గా చేశారు. కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన హావిూలన్నీ తూచా తప్పకుండా చేస్తుందని అన్నారు.టిఆర్‌ఎస్‌ పార్టీ మేనిఫెస్టో ఉన్న దళితులకు 3 ఎకరాల భూమిగాని ,ఇంటింటా నల్లాగాని,డబుల్‌ బెడ్‌ రూమ్‌ లో గాని ఇవ్వకుండా మధ్యంతర ఎన్నికలు పెట్టి తమ లబ్ది కోసమే చూసుకున్నారే తప్ప ప్రజల కోసం ఆలోచించలేదు అన్నారు.కావున మన బతుకులు మారాలన్నా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒకటేనని, చేతి గుర్తు పై ఓటు వేసి కేకే మహేందర్రెడ్డి ని అధిక మెజార్టీతోటి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల జిల్లా అధ్యక్షులు రవి యూత్‌ కాంగ్రెసు ఉపాధ్యక్షుడు తిరుపతి కాంగ్రెస్‌ నాయకులు లెంకల రాజు పెడతనపళ్లి రాములు తదితరులు పాల్గొన్నారు.

 

 

 

Other News

Comments are closed.