టీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు

share on facebook

పంచాయితీలుఎ లక్ష్యంగా ప్రోత్సాహం

హైదరాబాద్‌,జనవరి7(జ‌నంసాక్షి): రాబోయే పంచాయతీ ఎన్నికలే లక్ష్యంగా గ్రామాల్లో టిఆర్‌ఎస్‌లో చేరికలు జోరుగా సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్‌ఇనకల ముందు కూడా చేరికలు సాగినా, ఇప్పుడు పంచాయితీ ఎన్‌ఇనకల్లో ఈ చేరికల వకారణంగా టిఆర్‌ఎస్‌ మరింత బలోపేతంగా కనిపిస్తోంది. అనేక గ్రామాలు ఏకగ్రీవం అవుతున్న దశలో చేరికలతో అత్యధిక సీట్లను గెల్చుకునేలా టిఆర్‌ఎస్‌ చేస్తున్న వ్యూహం ఫలిస్తోంది. టిఆర్‌ఎస్‌ పిలుపుతోఅన్ని పార్టీల నాయకులు తమ పార్టీలకు రాజీనామా చేసి గులాబీ గూటికి చేరుతున్నారన్నారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ప్రతీ పల్లెలో గులాబీ జెండా ఎగుర వేయాలని, ఆ దిశగా శ్రేణులు పనిచేయాలని నేతలు సూచించారు. ముఖ్యంగా అన్ని గ్రామాల్లో ఏకగ్రీవంగా సర్పంచ్‌ ఎన్నుకుంటే ఆయా గ్రామాలకు రూ.10 లక్షలతో పాటు ఏకగ్రీవం అయిన గ్రామానికి ఎమ్మెల్యే నిధులు రూ.5 లక్షలు ఇస్తానని అంటున్నారు. పేదల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ అహర్నిషలూ కృషి చేస్తున్నారని, రైతు బంధు, రైతు బీమా, ఆసరా, ఆహార భద్రత, కల్యాణలక్ష్మి వంటి పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయన్నారు. ప్రతీ పల్లెపై గులాబీ జెండా ఎగరాలని, తెలంగాణలో సుపరిపాలన ను అందిస్తూ దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ చరిత్రలో నిలిచిపోయారని పార్టీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ అన్నారు. కాంగ్రెస్‌ మోసపూరి మాటలను తెలంగాణ ప్రజలు నమ్మే రోజులు పోయాయన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలోని సర్కారు చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై టీఆర్‌ చేరుతున్నారన్నారు. జిల్లా స్థాయిలో వివిధ ¬దాల్లో పనిచేస్తు న్న నాయకులు టీడీపీ,కాంగ్రెస్‌, బిజెపిలను వీడి టీఆర్‌ఎస్‌లో చేరడం సంతోషంగా ఉందన్నారు.

Other News

Comments are closed.