టీఆర్‌ఎస్‌ అంటే కాంగ్రెస్‌కు వణుకు

share on facebook

– వచ్చేఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష¬దాకూడా రాదు
– ప్రగతి సభకు ప్రజలు చీమల దండులా కదులుతున్నారు
– ఈ సభ తరువాత కాంగ్రెస్‌ నేతలు పెట్టుకొనేవి ఆవేదన సభలే
– విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి
– పొంగులేటి ఆధ్వర్యంలో ట్రాక్టర్‌ల ర్యాలీకి స్వాగతం పలికిన మంత్రి
– సూర్యాపేట నుండి 300 ట్రాక్టర్‌లలో బయలెల్లిన రైతులు
– ట్రాక్టర్‌ నడిపి ప్రారంభించిన మంత్రి జగదీష్‌రెడ్డి
సూర్యాపేట, సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ) : టీఆర్‌ఎస్‌ పార్టీ పేరు వినగానే కాంగ్రెస్‌ పార్టీకి వణుకు పుడుతుందని విద్యుత్‌, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లాలో ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సారథ్యంలో ప్రారంభమైన ట్రాక్టర్‌ ర్యాలీ  శనివారం మధ్యాహ్నం సూర్యాపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆ ట్రాక్టర్‌ ర్యాలీకి జగదీశ్‌రెడ్డి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్‌ తో కలిసి మంత్రి మాట్లాడారు.. ప్రగతి సభకు ప్రజలు చీమల దండులా కదులుతున్నారని మంత్రి జగదీశ్‌ రెడ్డి చెప్పారు. పండుగ వాతావరణంలో గ్రామాల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారని తెలిపారు. ఖమ్మం నుంచి 2 వేల ట్రాక్టర్లలో రైతులు తరలి రావడం నిజంగా అద్భుతం అన్నారు. యావత్‌ రైతాంగం సీఎం కేసీఆర్‌ వెంట నడుస్తున్నారని చెప్పారు. వందల కిలోవిూటర్లు ట్రాక్టర్లపై ప్రయాణిస్తూ సభకు తరలిరావడం ఓ చరిత్ర అని, సీఎం కేసీఆర్‌ పై రైతులు చూపిస్తున్న ప్రేమకు ఇది నిదర్శనం అన్నారు. వారికి పాదాభివందనం చేస్తున్నామన్నారు. రైతే ఈ  రాష్ట్రానికి సీఎం అయ్యారని, అందుకే తెలంగాణలో రైతు కుటుంబాలు చాలా భరోసాగా, ధైర్యంగా ఉన్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష ¬దా కూడా దక్కదన్నారు. ప్రగతి నివేదన సభ తర్వాత కాంగ్రెస్‌ నాయకులు పెట్టుకునే ప్రతి సభ.. ఆవేదన సభలే అని మంత్రి ఎద్దెవా చేశారు. ప్రగతి నివేదన సభకు ప్రజలు పెద్దఎత్తున తరలి వస్తుండటంతో.. అది చూడలేక.. కాంగ్రెస్‌ నాయకులు సభపై దుష్పచ్రారం చేస్తున్నారని మండిపడ్డారు. సమ్మక్క – సారలమ్మ, లింగమంతుల జాతరకు తరలినట్లుగా ప్రగతి నివేదనకు జనం తరలుతున్నారని తెలిపారు. రైతే రాజు అన్న కాంగ్రెస్‌ నాయకులు.. రైతు వెన్నెముక
విరిచారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ సీఎం కేసీఆర్‌ రైతును రాజుగా చేశాడని పేర్కొన్నారు. కేసీఆర్‌ ప్రసంగం కోసం తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారని మంత్రి చెప్పారు.
కుంభమేళాను తలపించేలా సభ – ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి
ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో ఉన్న తెలంగాణ బిడ్డలు కూడా సభకు తరలి వస్తుండడం చాలా సంతోషంగా ఉందని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ దార్శనీకతతో దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచిందన్నారు. రైతుల తలరాతలు మార్చిన గొప్ప మహానుభావుడు సీఎం కేసీఆర్‌ అని కొనియాడారు. తమకు సూర్యాపేట జిల్లా వాసుల స్వాగతం మరచిపోలేనిదన్నారు. కుంభమేళాను తలపించే ఈ సభ చరిత్రలో నిలిచిపోతుందని ఎంపీ అభిప్రాయపడ్డారు
300 ట్రాక్టర్లలో సభకు బయలెల్లిన సూర్యాపేట రైతులు ..
హైదరాబాద్‌ కొంగర కలాన్‌ లో ప్రగతి నివేదన సభకు సూర్యాపేట నుంచి 300 ట్రాక్టర్లలో రైతులు బయలుదేరారు. మంత్రి జగదీశ్‌ రెడ్డి స్వయంగా ఐదు కిలోవిూటర్ల దూరం ట్రాక్టర్‌ నడిపి ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్వచ్చందంగా ప్రజలు సభకు తరలివస్తున్నారని అన్నారు. దేశంలోనే ఎక్కడా జరగని విధంగా ప్రగతి నివేదన సభ నిలిచిపోతుందని అన్నారు.

Other News

Comments are closed.