టీఎస్‌లో‘స్థానిక’పోరు:ఈసీకి తేదీల ప్రతిపాదన

share on facebook

హైదరాబాద్‌: తెలంగాణలో త్వరలోనే జిల్లా, మండల ప్రజా పరిషత్‌  ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 22 నుంచి మే 14 వరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘానికి ప్రతిపాదించింది. ఎన్నికల నిర్వహణకు గత కొన్నాళ్లుగా ఈసీ కసరత్తు చేస్తోంది.  ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది. రాజధాని హైదరాబాద్‌ మినహాయిస్తే 32 జిల్లాల్లో 535 జడ్పీటీసీ, 5,857 ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లను ఇప్పటికే  ప్రకటించింది.
లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ముగియగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇదివరకే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. దీనికి ఈసీఐ సుముఖత వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి గతంలోనే లేఖ రాసింది. శుక్రవారం దీనిపై ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు  నిర్వహించాలంటూ తేదీలను ఈసీకి ప్రతిపాదించింది. గురువారం జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మే 23న వెల్లడి కానున్నాయి. వాటి తర్వాతే స్థానిక సంస్థల ఫలితాలను ప్రకటించే అవకాశముంది.

Other News

Comments are closed.