టూవీలర్‌ను ఢీకొన్న లారీ

share on facebook

ప్రమాద స్థలంలొనే దంపతులు మృతి

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌11(జ‌నం సాక్షి): జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం చెందారు. దమ్మపేట మండలం మొద్దులగూడెం గ్రామ సవిూపంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన దంపతులు తమ ఇద్దరు పిల్లలతో సహా ద్విచక్రవాహనంపై సత్తుపల్లికి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. ప్రమాదంలో భార్యా, భర్తలు అక్కడికక్కడే మృతి చెందగా, చిన్నారులు సురక్షితంగా ఉన్నారు. ప్రమాద స్థలం నుంచి లారీ డ్రైవర్‌ పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Other News

Comments are closed.