టెక్నాలజీ ప్రజాస్వామ్యానికి ప్రమాదం

share on facebook

– అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా

– ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా ఇంటర్నెట్‌

– విశ్వవ్యాప్తంగా భారత్‌ తనపాత్రను పోషించాలి

– పేదలు, ధనికుల మధ్య వ్యత్యాసాలు తగ్గించాలి

– భారత్‌ – అమెరికా కలిసిపనిచేస్తే పరిష్కారంకాని సమస్యంటూ ఉండదు

– లీడర్‌షిప్‌ సదస్సులో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా

న్యూఢిల్లీ,డిసెంబర్‌ 1,(జనంసాక్షి): ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న లీడర్‌షిప్‌ సదస్సులో ఆయన శుక్రవారం మాట్లాడారు. అమెరికాది అత్యంత పురాతన ప్రజాస్వామ్యం అని, భారత్‌ది అత్యంత పెద్ద ప్రజాస్వామ్యం అని ఒబామా అన్నారు. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే సత్తా ఇంటర్నెట్‌కు ఉందని కూడా ఒబామా హెచ్చరించారు. రాజ్యాంగంలో ఉన్న విలువలను ప్రతిరోజు మనం ప్రచారం చేయాలన్నారు. భవిష్యత్తు తరాలకు వాటిని అందించాలన్నారు. కేవలం ఆసియాలో మాత్రమేకాకుండా, విశ్వవ్యాప్తంగా భారత్‌ తన పాత్రను పోషించాలని ఒబామా సూచించారు. మధ్యతరగతి ప్రజలను నిర్లక్ష్యం చేస్తున్నారని, పేద-ధనికుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించాలని ఆయన అభిప్రాయపడ్డారు. పారిస్‌ వాతావరణ ఒప్పందం కోసం తాను, ప్రధాని మోదీ విశేషంగా కృషి చేసినట్లు చెప్పారు. ఇటీవల విూడియా ఎక్కువైన విషయాన్ని తెలియజేస్తూ.. నిజమైన వార్తలను గుర్తించాలని, కొత్త సమాచారం యుగం అవసరమన్నారు. భారత్‌, అమెరికాలు కలిసి పనిచేస్తే, పరిష్కారం కాని సమస్య అంటూ ఏదీ ఉండదన్నారు. తనకు పప్పు, చికెన్‌ వండడం తెలుసన్నారు. తనకు చెపాతీలు చేయడం రాదన్నారు. అంతర్జాతీయంగా ప్రజల్లో అభద్రతాభావం

ఉందని, దాన్ని తొలిగిస్తేనే మానవ ప్రగతి సాధ్యమవుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశ ఐక్యత కోసం పనిచేస్తున్నారని, కానీ ప్రజలు మద్దతు ఇస్తేనే నవ సమాజం ఏర్పడుతుందని ఒబామా అన్నారు. న్యూక్లియర్‌ సైప్లె గ్రూప్‌లో భారత్‌ను చేర్చాలని తాము ప్రయత్నించామని, కానీ కొన్ని దేశాలు అడ్డుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఉగ్రవాద చర్యలు ఎవరినైనా ఇబ్బందిపెడుతాయని ఆయన అన్నారు. ముంబై దాడుల తర్వాత తాము ఆ విధంగా ఆలోచన చేశామన్నారు. ప్రధాని మోదీని వ్యక్తిగతంగా తాను ఇష్టపడుతానని, అతను దేశాభివృద్ధి కోసం చేస్తున్న కృషి చేస్తున్నారని, మాజీ ప్రధాని మన్మోహన్‌ అన్నా తనకు అభిమానమని ఒబామా అన్నారు.

 

 

 

Other News

Comments are closed.