టెన్త్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

share on facebook

విద్యార్థులకు సన్నద్ధత కార్యక్రమాలు పూర్తి
నల్లగొండ,మార్చి8(జ‌నంసాక్షి): జిల్లా వ్యాప్తంగా టెన్త్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా
విద్యాశాఖాధికారి తెలిపారు.  పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో ఇన్విజలేటర్లు సెల్‌ఫోన్‌ వాడకుండా నిబంధనలు పెట్టామని అన్నారు.  ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలుంటాయని  హెచ్చరించారు. పదో తరగతి పరీక్షల సందర్భంగా  జిల్లా వ్యాప్తంగా  పరీక్షకు హాజరయ్యే  విద్యార్థులు యూనిఫామ్‌ లేకుండా సివిల్‌ డ్రెస్‌లో రావాలని సూచించారు. ప్రతి ఉపాధ్యాయుడు ఉత్తీర్ణత శాతాన్ని పెంచడంతో పాటు జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని సూచించారు. పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణతశాతం పెంచాలనే ఉద్దేశంతో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ-తెలంగాణ సంసిద్ధత కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నెల 16న వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న తరుణంలో సబ్జెక్టు నిపుణుల సూచనలతో టీ-శాట్‌ ద్వారా ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. సులభ పద్ధతులు బోధిస్తూ, సందేహాలు తీర్చుతూ విద్యార్థులను మానసికంగా సంసిద్ధులను చేస్తోంది. ముఖ్యమైన అంశాలు, ప్రశ్నలతీరు, సమాధానాలు రాసే విధానంపై మెళకువలు నేర్పిస్తోంది.ఈనెల 16నుంచి ఏప్రిల్‌ 2వరకు జరిగే పదోతరగతి వార్షిక పరీక్షల్లో విజయం సాధించడంతో పాటు ఉత్తమ గ్రేడ్స్‌ సాధించేలానే లక్ష్యం విద్యార్థుల్లో ఉంటుంది. అందుకు సంవత్సరం చదివిన సబ్జెక్టులోని అంశాలను పరీక్షలకు ఏవిధంగా చదువాలనేది ప్రణాళిక అవసరం. దీనికి నల్లగొండ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇప్పటీ ప్రభుత్వ యాజమన్యాల
పరిధిలోని పాఠశాలల్లో  అనే ప్రణాళికతో విద్యార్థును చదివించి పరీక్షలను సిద్ధం చేశారు. పరీక్షలు మరో వారం రోజుల్లో ప్రారంభమవుతుండా విద్యార్థులకు ఆయా సబ్జెక్టులో అవగాహన కల్పించి సిద్ధం చేసే దిశగా సంసిద్ధతా పేరుతో నూతన కార్యక్రమానికి అమలు చేస్తుంది. జిల్లావ్యాప్తంగా 11 మేనేజిమెంట్ల వారీగా మార్చి 2019లో జరిగే పరీక్షలకు 20,594 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వీరందరికీ ఆయా యాజమాన్యాలు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తునే ఉన్నారు. వీరిలో 10,609 మంది బాలు రు, 9,985 మంది బాలికలు ఉన్నారు.

Other News

Comments are closed.