టెన్త్‌ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు

share on facebook

కామారెడ్డి,మార్చి13(జ‌నంసాక్షి): పదో తరగతి పరీక్షల నిర్వహణలో లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేశామని
డీఈవో రాజు తెలిపారు. పదో వతరగతి పరీక్షల నిర్వాహణపై ఉన్నతాధికారుల సూచనల మేరకు అన్ని
చర్యలు తీసుకున్నామని అన్నారు. ఈ నెల 16 నుంచి వచ్చే నెల 3 వరకు పరీక్షలు ఉంటాయని తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఆలస్య నివారణకు తమ పరీక్షా కేంద్రాన్ని ఒకరోజు ముందుగానే సందర్శించి, కేంద్రాలను గుర్తించాలని అన్నారు. వెబ్సైట్‌లో ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. పరీక్షా కేంద్రంలోకి సెల్‌ఫోన్లు, ఎలక్టాన్రిక్‌ పరికరాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రానికి వంద విూటర్ల పరిధిలో 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని, ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిరాక్స్‌ కేంద్రాలు మూసివేయించాలని ఆదేశించారు. పోలీస్‌ శాఖ, వైద్య సిబ్బంది, ఆర్టీసీ, విద్యుత్త్‌ శాఖ, పోస్టల్‌ శాఖలు పరస్పరం సమన్వయంతో పరీక్షలు నిర్వహించబోతున్నామని అన్నారు.  జిల్లాలో 57 ప్రభుత్వ, మూడు ప్రైవేట్‌ కలిపి మొత్తం 60 కేంద్రాల ద్వారా 12,767 మంది విద్యార్థు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణపై సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశామని వివరించారు.

Other News

Comments are closed.