టోల్‌గేట్‌ వద్ద అదుపు తప్పిన లారీ

share on facebook

మెదక్‌,జూలై23(జ‌నంసాక్షి): అతివేగంగా వచ్చిన లారీ వేగ నియంత్రణ చేయలేక టోల్‌గేట్‌ కేబిన్‌పైకి దూసుకెళ్లిన ఘటన మంగళవారం వేకువజామున చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..జిల్లాలోని తూప్రాన్‌ మండలం అల్లాపూర్‌ శివారులో 44వ జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నిజామాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఓ లారీ  అల్లాపూర్‌ టోల్‌గేట్‌వద్దకు రాగానే అతివేగంగా వచ్చి వేగనియంత్రణ చేయలేక టోల్‌ బూత్‌పైకి దూసుకెళ్లింది. అప్రమత్తమైన సిబ్బంది బూత్‌ నుంచి తప్పించుకోవడంతో పెను ప్రమాదమే తప్పింది. గతంలోనూ ఇదే ప్రాంతంలో ఇదే తరహాలో ప్రమాదం చోటు చేసుకున్నట్లు సిబ్బంది చెబుతున్నారు.

Other News

Comments are closed.