డివైడర్‌ను ఢీకొన్న కారు: ఒకరు మృతి

share on facebook

సూర్యాపేట,జూలై23(జ‌నంసాక్షి): నేషనల్‌ హైవే 65పై జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద ఎన్‌హెచ్‌ 65పై విజయవాడ నుంచి హైదరాబాదు వెళుతున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కారులో మొత్తం ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Other News

Comments are closed.