డిసెంబర్‌లో కోహ్లి, అనుష్క పెళ్లి?

share on facebook

న్యూఢిల్లీ,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): టీమిండియా మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, బాలీవుడ్‌ బ్యూటీ అనుష్క శర్మ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. డిసెంబర్‌లోనే వాళ్ల పెళ్లి జరగనున్నట్లు ద న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక వెల్లడించింది. డిసెంబర్‌లో తనకు క్రికెట్‌ నుంచి కాస్త బ్రేక్‌ కావాలని కోహ్లి బీసీసీఐని అడిగినప్పటి నుంచి వీళ్ల పెళ్లిపై పుకార్లు మొదలయ్యాయి. మూడేళ్లుగా డేటింగ్‌లో ఉన్న ఈ సెలబ్రిటీ కపుల్‌.. గత సమ్మర్‌లోనే ఎంగేజ్‌మెంట్‌ చేసుకోబోతున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ముస్సోరీలో ఈ జంట కొన్ని రోజులు స్టే చేయడంతో అక్కడే వీళ్ల నిశ్చితార్థం జరగనున్నట్లు పుకార్లు వచ్చాయి. అయితే తర్వాత అలాంటిదేవిూ లేదని అనుష్క వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మరోసారి విరాట్‌ క్రికెట్‌ నుంచి బ్రేక్‌ అడిగాడన్న వార్తతో ఏకంగా వీళ్ల పెళ్లే జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మధ్యే ఈ జోడీ కలిసి నటించిన మాన్యవర్‌ యాడ్‌ ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే విరాట్‌ శ్రీలంకతో జరగబోయే టెస్ట్‌ సిరీస్‌కు మాత్రం అందుబాటులో ఉంటాడని ఇప్పటికే చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ చెప్పిన నేపథ్యంలో.. అతనికి వన్డే, టీ20 సిరీస్‌లో రెస్ట్‌ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Other News

Comments are closed.