తండాలను పంచాయితీలుగా చేస్తామన్న హావిూ నెరవేరింది

share on facebook

ఆదిలాబాద్‌,మార్చి30(జ‌నంసాక్షి): తండాలను పంచాయమితీలుగా మార్చి ఇచ్చిన హావిూని నిలబెట్టిన ఘనత సిఎం కెసిఆర్‌దని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. పంచాయితీల పటిష్టానికి నిధుల వరద పారనుందన్నారు. గతానికి భిన్నంగా ఇక గ్రామాలు అభివృద్దిలో పయనించనున్నాయని అన్నారు.   మున్సిపాలిటీ, నియోజకవర్గం దినదినాభివృద్ధి చెందుతోందని.. కలహాల కాంగ్రెస్‌కు కాలం చెల్లిందని అన్నారు. ఆదిలాబాద్‌ పట్టణం ఇంతకాలం అభివృద్ధి కాకపోవడానికి ముఖ్య కారణం కాంగ్రెస్‌ పార్టీ అన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి కూడా పట్టణాన్ని నిర్లక్ష్యం చేశారన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో బల్దియాకు నిధులు కేటాయిస్తోందన్నారు. పట్టణంలో రూ.వంద కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, ఆసరా పింఛన్లు, కేసీఆర్‌ కిట్లు వంటి ఆదర్శవంతమైన సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ పదేళ్ల కాలంలో పట్టణ ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని సవాల్‌ విసిరారు. కాంగ్రెస్‌ పార్టీకి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి భంగపాటు తప్పదని స్పష్టం చేశారు.

Other News

Comments are closed.