తనపై దుష్పచ్రారం ఆపండి

share on facebook

ట్విట్టర్‌లో సురేశ్‌ రైనా
న్యూఢిల్లీ,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): సోషల్‌ విూడియాలో తనపై జరుగుతున్న దుష్పాచ్రారం అంతా అబద్ధమని టీమిండియా క్రికెటర్‌ సురేశ్‌ రైనా ట్విటర్‌లో తెలిపాడు. కారు ప్రమాదంలో రైనా తీవ్రంగా గాయపడ్డాడని, చనిపోయాడని కొంతమంది నెటిజన్లు యూట్యూబ్‌లో పుకార్లు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆల్‌రౌండర్‌ రైనా స్పందించాడు. నేను కారు ప్రమాదంలో గాయపడ్డానని కొన్ని రోజులుగా ఫేక్‌ న్యూస్‌ ప్రచారంలో ఉంది. ఆ పుకారుతో మా కుటుంబసభ్యులు,స్నేహితులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. దయచేసి అలాంటి ఫేక్‌న్యూస్‌ను నమ్మొద్దు. వాటిని ప్రచారం చేయడం ఆపేయండి. దేవుడి దయవల్ల నేను బాగానే ఉన్నాను. ఇలాంటి పుకారును సృష్టించి వైరల్‌ చేసిన యూట్యూబ్‌ ఛానెల్స్‌ను గుర్తించాం. త్వరలోనే వారిపై కఠిన చర్యలు కూడా తీసుకుంటామని రైనా హెచ్చరించారు. ఫామ్‌ కోల్పోయిన రైనా కొన్ని నెలలుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. మరికొన్ని నెలల్లో ఐపీఎల్‌ ఆరంభంకానుండగా లీగ్‌లో సత్తాచాటేందుకు సన్నద్ధమవుతున్నాడు.

Other News

Comments are closed.