తిత్లీ బాధితులకు అకౌంట్ల ద్వారా డబ్బు జమ

share on facebook

పారదర్శకంగా పరిహారం అందచేత

25 రోజుల్లోనే పరిహారం ఇస్తున్న ఘనత

వివరాలు వెల్లడించిన కలెక్టర్‌

శ్రీకాకుళం,నవంబర్‌6(జ‌నంసాక్షి): పారదర్శకంగా తిత్లీ తుఫాను నష్టపరిహారాన్ని లబ్దిదారుల బ్యాంకు అక్కౌంటుకు జమ చేయనున్నట్లు జిల్లా కలెక్టరు కె.ధనంజయ రెడ్డి తెలిపారు. మంగళవారం కలెక్టరు సమావేశ మందిరంలో పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తిత్లీ తుఫాను సంభవించిన 25 రోజులలో నష్ట పరిహారాన్ని అందించి ఒక చరిత్రను సృష్టించడం జరిగిందని

అన్నారు. అధికారులు నిరంతర సేవలందించారని, ఎన్యూమరేషన్‌ త్వరితగతిన పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. నష్టపరిహారం ఎంట్రీలు ఇప్పటి వరకు 4.29 లక్షల రికారు&ఢలకు గాను 3 లక్షల 95 వేలు జిల్లా కలెక్టరు స్ధాయిలో పరిశీలన చేయడం జరిగిందని తెలిపారు. సుమారు రూ.348 కోట్లు లబ్దిదారు అక్కౌంటులోకి జమ కాబడ్డాయని చెప్పారు . మండల స్ధాయిలో 2,110, డిపార్టు మెంటు అధికారుల స్ధాయిలో 14,277 పెండింగ్‌ లో వున్నాయని, 15,735 రికార్డులు పరిశీలన చేయవలసి వుందని తెలిపారు. క్షేత్రస్ధాయి పరిశీలన చేసి వారం రోజులలోగా లబ్దిదారుల బ్యాంక్‌ అక్కౌంట్లకు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. కొత్తగా 80 వేల దరఖాస్తులు వచ్చాయని, ఎన్యూమరేషన్‌ లో తప్పిదాలను పునఃపరిశీలన చేసి వాటిని సరిచేస్తామని చెప్పారు. తప్పిపోయిన లబ్దిదారులకు న్యాయం చేస్తామని, జరిగిన నష్టం కన్నా ఎక్కువ సొమ్ము జమ కాబడిన సందర్భంలో వారి నుండి రికవరీ చేస్తామన్నారు. ఇప్పటి వరకు సుమారు ఒక లక్ష వరకు పడిపోయిన చెట్లను 4వందల పవర్‌ సాస్‌ తో తొలగించడం జరరిగిందన్నారు. 3 వేల ఎకరాలలో పడి పోయిన చెట్లను ఇప్పటి వరకు తొలగించడం జరిగిందన్నారు. పారదర్శకంగా నష్టపరిహారాన్ని పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. తుఫాను ప్రాంతానికి పూర్వ వైభవం తీసుకురావాలనే వుద్దేశ్యంతో తూర్పు (తిత్లీ ఉద్దానం రి-కన్ట్సక్షన్ర్‌ ప్రాజెక్టు యూనిట్‌) అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. విధి విధానాలను త్వరలోనే రూపొందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఉద్దానం ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించే కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు,. ఇందులో పారిశ్రామిక వేత్తలు, స్వఛ్ఛంద సంస్ధలు, ప్రభుత్వం సహకారంతో కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. స్కిల్‌ డెవలెప్‌ మెంట్‌ పై శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేసి యువతకు నైపుణ్యాభివృధ్ధి కలిగించనున్నామని తెలిపారు. ఉద్దానం ప్రాంతంలోని యువతకు స్పెషల్‌ రిక్రూట్‌ మెంట్‌ డ్రైవ్‌ ద్వారా ఉపాధి, ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యం, గృహనిర్మాణాలకు ప్రాధాన్యత నిస్తున్నట్లు తెలిపారు. కవిటిలో డయాలసిస్‌ యూనిట్‌ ను ఏర్పాటు చేయడం జరిగిందని, పరిశుభ్రమైన త్రాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. తుఫానులో 43 వేల గృహాలు దెబ్బతిన్నాయని, ఇందులో 20 వేల పక్కా గృహాలు ధ్వంసమయ్యాయని చెప్పారు. ఉద్దానం ప్రాంతంలో సుమారు 50 వేల ఇళ్ళు నిర్మించవలసి వుంటుందన్నారు. బుధవారం ముఖ్యమంత్రి సతీమణితో కలసి ఇఛ్చాపురం రానున్నారని, తహశీల్దార్‌ కార్యాలయం నుండి గ్రౌండ్‌ వరకు సాయంత్రం 6 గం.లకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహణ , పూజా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ముఖ్యమంత్రి సందేశం అనంతరం దీపావళి బాణాసంచా తో కార్యక్రమం ముగియనున్నట్లు తెలిపారు. తిత్లీ తుఫాను బాధితులకు అండగా వుంటూ, వారిలో ధైర్యం నింపడానికి ముఖ్యమంత్రి దీపావళి పర్వదినాన ముఖ్యమంత్రి పర్యటిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో సంయుక్త కలెక్టరు కెవిఎన్‌.చక్రధరబాబు పాల్గొన్నారు

 

 

Other News

Comments are closed.