తుపాకీతో కాల్చుకుని మాజీ సైనికోద్యోగి ఆత్మహత్య

share on facebook

హైదరాబాద్‌, జనవరి25(జ‌నంసాక్షి) : పాతబస్తీలో ఓ మాజీ సైనికోద్యోగి తుపాకీతో కాల్చుకుని బలవర్మణానికి పాల్పడ్డాడు. తన భార్య అరోగ్య పరిస్థితి సరిగా ఉండడంలేదనే మనస్థాపంతోనే అతను
ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కామాటిపుర పోలీసుస్టేషన్‌ పరిధిలోని మహారాజ్‌గంజ్‌లో వేణుగోపాల్‌ అనే మాజీ సైనికోద్యోగి నివాసముంటున్నాడు. ఇతని భార్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో మనస్థాపానికి గురైన వేణుగోపాల్‌ తాను నివాసముంటున్న భవనం రెండవ అంతస్తులోకి వెళ్లి తన వద్దనున్న గన్‌ను నోట్లో పెట్టుకుని కాల్చుకున్నాడు. దీంతో అతని తల చిద్రమై అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులతో పాటు చార్మినార్‌ ఏసీపీ అంజయ్య సంఘటనా స్థలానికి చేరుకుని  పరిశీలించారు. మృతుడి గదిలో ఓ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నా ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని ఆ లేఖలో రాసి ఉంది. పోలీసులు ఆ లేఖను, తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. అలాగే కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Other News

Comments are closed.