తెరాస అభ్యర్థి ఇంటింటి ప్రచారం

share on facebook

వరంగల్‌ రూరల్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): నామినేషన్‌ పక్రియ ముగియడంతో అభ్యర్థులంతా ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు. నర్సంపేట నియోజకవర్గం తెరాస అభ్యర్థి పెద్ది సుదర్శన్‌ రెడ్డి మండలంలోని లక్నేపల్లి, రామవరం, మర్రినర్సయ్యపల్లి గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఓటర్లను కలిసి ఎన్నికల గుర్తు చూపించి, గెలిపించాలని అభ్యర్థించారు. గ్రామస్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళలు, పార్టీ శ్రేణులు కోలాటాల ప్రదర్శనలు, నృత్యాలు చేశారు.

 

 

 

 

Other News

Comments are closed.