తెలంగాణకు బిజెపి చేసింది శూన్యం

share on facebook

ఆ పార్టీకి ఓట్లడిగే అర్హత లేదు: మంత్రి
ఆదిలాబాద్‌,మార్చి26(జ‌నంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరానికి నిధులిచ్చిన కేంద్రం కేంద్ర ప్రభుత్వం.. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరానికి నిధులివ్వలేదని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ఆరోపించారు. ఎన్నోమార్లు సిఎం కెసిఆర్‌ కాళేవ్వరం గురించి చెప్పినా పట్టించుకోలేదన్నారు. ఇలాంటి వారు తెలంగాణకు ఏదో చేస్తామని ప్రచారం చేస్తే ప్రజలునమ్ముతారా అని అన్నారు. తెలంగాణలో 16 ఎంపి సీట్లు గెలిస్తే మనమే శాసించే పరిస్థితి వస్తుందని అన్నారు. ఆదిలాబాద్‌, పెద్దపల్లిలో రెండు సీట్లను భారీ మెజార్టీతోగెల్చుకుంటామని ఆయన అన్నారు. మంగళవారం వివిధ ప్రాంతాల్లో ఆయన ఉదయమే ప్రాచరంలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో ఓటు ద్వారా భాజపాకు బుద్ధి చెప్పాలన్నారు. కేంద్రం నుంచి మన వాటా కింద రావాల్సిన నిధులు మాత్రమే వచ్చాయని ప్రత్యేకంగా ఒక్క రూపాయి కూడా అదనంగా రాలేదన్నారు. రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలు గెలిస్తే కేంద్రాన్ని కేసీఆర్‌ శాసించి నిధులు తీసుకువస్తారని తెలిపారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఇకపోతే  ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్శితులై ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులందరూ తమ పార్టీలో చేరుతున్నారని మంత్రి అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉన్నాయని అన్నారు.

Other News

Comments are closed.