తెలంగాణలో కొత్తగా 894 కరోనా కేసులు

share on facebook

హైదరాబాద్‌,నవంబరు 20(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 39,448 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 894 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,61,728కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో నలుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,423కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 1,057 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,47,790కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 12,515 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 10,245 మంది ¬ం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు తెలంగాణలో నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 50,50,612కి చేరింది.

 

 

 

 

Other News

Comments are closed.