తెలంగాణలో బలమైన నేతగా కెసిఆర్‌

share on facebook


కాంగ్రెస్‌ ఆశలు అడియాశలవుతున్న వేళ
ఎన్నికలల్లో గెలుపు లక్ష్యంగా కెసిఆర్‌ కసరత్తు
హైదరాబాద్‌,మార్చి12(జ‌నంసాక్షి): మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు..తాజాగా మండలి ఎన్నికల వ్యవహారాలు చూస్తే.. అన్ని పార్టీలు కలసినా ఇప్పుడు కెసిఆర్‌ను ఢీకొనడం సాధ్యం కాకపోవచ్చు.  ముఖ్యమంత్రి కేసీఆర్‌ బలంగా ఉన్నారని తెలంగాణలో అమలవుతున్న పథకాలతో దేశవ్యాప్తంగా ప్రచారం సాగుతోంది. ఇదొక్కటే చాలు కెసిఆర్‌ రేపటి లోక్‌సభ ఎన్నికలపై ధీమాగా ఉన్నారనడానికి. ఎపిలో  ముఖ్యమంత్రి చంద్రబాబు బలహీన పడుతున్నారని ప్రచారం సాగుతున్న వేళ తెలంగాణలో కెసిఆర్‌ మరింతగా బలోపేతం కావడం రాజకీయంగా కలసివచ్చే అంశంగా చూడాలి. అయితే ఏపీలో చంద్రబాబుకు తిరుగులేదనీ, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్‌రెడ్డిపై ప్రజలలో నమ్మకం రావడం లేదనీ లోపాయకారిగా బాబు ప్రచారం చేసుకుంటున్నా అంత సీన్‌ లేదని ఎపి ప్రజలే బాహాటంగా  అంటున్నారు.  తెలంగాణ ఏర్పడ్డ తరవాత బొటాబొటి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్‌ ముందుగా తన స్థానాన్ని పదిల పర్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగా ప్రతిపక్షాలను చీల్చి తాను బలపడటమే కాకుండా ప్రతిపక్షాలను బలహీనపరిచారు. ఇదంతా తెలంగాణ పునర్నిర్మాణంలో భాగమన్నారు. ఇది పార్టీల కలయికో లేదా విలీనంగానో చూడరాదన్నారు. ఇదంతా తెలంగాణ అభివృద్దిలో భాగమని విశ్లేషించారు.  ఆ తర్వాత వివిధ పథకాలకు రూపకల్పన చేయడం ద్వారా ప్రజాభిమానం చూరగొనే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే  రైతుబంధు పథకం ,డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు వంటి పథకాలు అందరిని ఆకట్టుకున్నాయి.  తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు 2లక్షల రుణమాఫీ అన్నా ప్రజలు ముఖ్యంగా రైతులు నమ్మలేదు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్ల ప్రజలలో అనుకూలత ఉన్నకారణంగా లోక్‌సభ ఎన్నికల్లో కూడా విజయం నల్లేరు విూద నడక కానుందన్న విశ్వాసం ఏర్పడింది. అందుకే 16 సీట్లు ఖాయమన్న రీతిలో ఉన్నారు.
పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి ఎదురు లేదని, ప్రజల్లో పూర్తిగా సానుకూల వాతావరణం ఉందని, మజ్లిస్‌ పార్టీతో కలిపి 17 ఎంపీ స్థానాల్లో విజయఢంకా మోగిస్తామని ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌ అన్నారు. దిల్లీలో తెరాస బలమైన శక్తిగా ఎదగాల్సిన అవసరాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తించారని, మరోసారి వారు ఆశీర్వదిస్తారని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారాన్ని ఈనెల 17 నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
శాసనసభ ఎన్నికల మాదిరే ఈ ఎన్నికల్లోనూ కష్టపడి పనిచేయాలని ఎమ్మల్యేలకు దిశానిర్దేశం చేశారు. అన్నిచోట్లా భారీ మెజారిటీతో గెలవాలి. ఇప్పటికే సర్వేలు నిర్వహించాం. అన్ని వర్గాల మద్దతు మనకే ఉంది. ఎన్నికల్లో మరోసారి  పెద్దఎత్తున ప్రచారం చేయాలి. మన విజయాలు, లక్ష్యాలు, ఆశయాల సందేశం ఇంటింటికీ చేరాలి. 17న కరీంనగర్‌లో జరిగే సభకు రెండు లక్షలమందిని తరలించాలి. నిజామాబాద్‌ సభకు భారీ సవిూకరణ జరగాలని సూచించారు. ఇదంతా ఆత్మవిశ్వాసంతో సాగుతున్న వ్యవహరాంగా చూడాలి.

Other News

Comments are closed.