తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ తేదీలివే!

share on facebook

హైదరాబాద్‌: తెలంగాణలో ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్‌బోర్డు విడుదల చేసింది. మే 16 నుంచి మే 27 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రథమ సంవత్సరం పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. ద్వితీయ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు. గురువారం ఇంటర్‌ ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే.

 

Other News

Comments are closed.