తెలంగాణ ఉద్యమ గొంతుక పైలం సంతోష్‌ ఇకలేడు

share on facebook

హైదరాబాద్‌,

నవంబరు 22(జనంసాక్షి):

తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో కన్నీరు పెట్టించిన పైలం సంతోష్‌ అనారోగ్యంతో మృతిచెందారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రశంశలు పొందిన ఉండు పైలంగుండు ..అమ్మమాయమ్మ.. బొంబాయిపోతున్న..తల్లిమాయమ్మ అంటూ ..ముద్దుల రాజాలో కొడు క ఉత్తరమేస్తున్న బిడ్డా..సల్లగుండు రాజాలు నువ్వు సక్కంగుండు రాజా లు.. తదితరపాటలు పాడారు. ఇది లా ఉండగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో తన ఆటా-పాటల ద్వారా ప్రజలను చై తన్య పరిచిన గొప్ప కళాకారుడు పైలం సంతోష్‌ అనారోగ్యంతో మృతి చెందడం పట్ల ఆదివారం రో జు భారత కమ్యూనిస్టు పార్టీ చేర్యా ల మండల సమితి ఆధ్వర్యంలో పా ర్టీ కార్యాలయంలో ఘనంగా నివా ళులర్పించారు.ఈసందర్భంగా ఆ యన పాడిన తెలంగాణ ప్రజల బతుకు పాటలను గుర్తు చేసుకు న్నారు.పేద కళాకారులను ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్‌, సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య,బొజ్జ బాలకృష్ణ, ముస్త్యాల శంకరయ్య,చేర్యాల మండల సహాయ కార్యదర్శి బండారి సిద్ధులు, సీపీఐ మద్దూరు మండల కన్వీనర్‌ వలబోజు నర్సింహా చారి, గజ్జల సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

సాంస్కృతిక రంగానికి తీరని లోటు…

తెలంగాణ ప్రజా ఉద్యమ గొంతుక నల్లగొండ జిల్లా కవి పైలం సంతోష్‌ మరణం సాంస్కృతిక రంగానికి తీరనిలోటని తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారుడు పిన్నింటి రత్నం అన్నారు. తన పాటలతో ప్రజలను చైతన్యం చేసిన ప్రజా వాగ్గేయకారుడు అని అన్నారు తెలంగాణ సాహితి రాష్ట్ర కమిటీ తరపున పైలం సంతోష్‌ కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో సారధి కళాకారులు శ్యాంసుందర్‌ హరిప్రసాద్‌ ఎలా సిద్ధులు పన్నీరు శ్రీను బండారు నర్సింలు తదితరులు పాల్గొన్నారు

 

Other News

Comments are closed.