తెలంగాణ కాంగ్రెస్‌కు భారీ షాక్‌

share on facebook

టిఆర్‌ఎస్‌లోకి రానున్న మరో ముగ్గరు ఎమ్మెల్యేలు

24న గులాబీ తీర్థం పుచ్చుకోనున్న జగ్గారెడ్డి, గండ్ర, పోదెం వీరయ్య

హైదరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): తెలంగాణ కాంగ్రెస్‌కు మరో భారీ షాక్‌ తగలనుంది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలుటిఆర్‌ఎస్‌లో చేరగా వారి దారిలో మరో ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి కారెక్కనున్నారు. ఈనెల 24న టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ముహూర్తం ఖరారైందని సమాచారం. ఇప్పటికే పలువురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరడంతో కాంగ్రెస్‌ శిబిరం ఖాళీ అయింది. దీంతో శాసనసభలో కాంగ్రెస్‌ ప్రతిపక్ష ¬దా కూడా కోల్పోనుంది. కాంగ్రెస్‌లో ఇక  ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, రాజగోపాల్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి, సీతక్క మాత్రమే మిగలనున్నారు. జూన్‌ మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో సీఎల్పీని టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజా చేరికలతో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సంఖ్య 104కు చేరనుంది. అలాగే 19 సీట్లున్నకాంగ్రెస్‌ బలం 6కు పడిపోనుంది. తెలంగాణ అసెంబల్‌ఈలో విపక్షం లేకుండా చరిత్ర సృష్టించనుంది. మొన్నటి అసెంబ్లీఎన్నికల్లో కాంగ్రెస్‌ 19 సీట్లతో విపక్ష పార్టీగా అవతరించగా 88 సీట్లతో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. టిడిపి రెండు సీట్లు సాధించగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడా టిఆర్‌ఎస్‌లో చేరడం ఖాయమయ్యింది.

Other News

Comments are closed.