తెలంగాణ రణక్షేత్రంలో ప్రచారం

share on facebook


తెలంగాణలో ప్రచార¬రు రణక్షేత్రాన్ని తలపిస్తోంది. హేమాహేవిూలు ప్రచారంలో దిగారు. ప్రధాని మోడీ రాకతో ప్రచారం మరింత వేడెక్కింది. అలాగే అమిత్‌షా కూడా తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటి కే ఓ మారు సోనియా, రాహుల్‌ ప్రచారం చేసిపోయారు. మరోమారు రాహుల్‌ వస్తున్నారు.  ఒక్క మారు బిజెపికి అవకాశం ఇవ్వండని బిజెపి నేతలు  కోరుతున్నారు.సిఎంకెసిఆర్‌ కూడా సుడిగాలి పర్యటనతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కూటమికి ఓటేస్తే చీకట్లు తప్పవని హెచ్చరి స్తున్నారు. అలాగే కాంగ్రెస్‌ కూటమి కూడా కెసిఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా ప్రచార ఉధృతిని పెంచింది. మొత్తంగా ఎవరి వాదనలు వారివి అన్నట్లుగా గతంలో ఎన్నడూ లేనంతగా  తెలంగాణ రణక్షేత్రంగా మారింది. ప్రజలు ఏ రకంగా ఆలోచిస్తారన్నది చూడాలి. ఎవరిని ఆదరిస్తారన్నది చూడాలి.  రైతులు, ప్రజలు, ఎస్సీ, ఎస్టీలను మోసం చేసిన, ఇచ్చిన మాటపై నిలబడని కేసీఆర్‌కు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని, ఓటు శిక్ష వేయాలని ఓ వైపు మహాకూటమి, మరోవైపు బిజెపిలు కెసిఆర్‌ లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీ కూడా తన ప్రచారంలో ఇవే అంవాలను ప్రధానంగా ప్రస్తావించారు. అసంపూర్తి వాగ్దానాలు, ప్రాజెక్టులు, పథకాలతో ఐదేళ్ల పరిపాలన కూడా పూర్తిచేయలేని ఈ అసంపూర్ణ సర్కారు నాయకుణ్ని నమ్మ వద్దని పిలుపునిచ్చారు.  ముందస్తు ఎన్నికలతో కొన్నినెలల ముందే ప్రజలు సమస్యల నుంచి బయటపడే మోక్షం లభించిందన్నారు. తెలంగాణ ఇవ్వాలని అడిగిన యువతను తూటాలతో కాల్చి చంపిన, వారి ఆత్మ బలిదానాలకు కారణమైన కాంగ్రెస్‌ను మరోసారి తెలంగాణలో అడుగుపెట్టనీయవద్దని కూడా మోడీ పిలుపు నిచ్చారు. కెసిఆర్‌ను, కాంగ్రెస్‌ను ఆయన ఒకే గాటన కట్టి ప్రచారం చేశారు. ఆత్మాభిమానంతో కూడిన ప్రభుత్వ ఏర్పాటుకు భాజపాకు ఓటు వేయాలని కోరారు. అధికారాన్ని మరోసారి కాంగ్రెస్‌, తెరాసలకు కట్టబెడితే, అమరవీరుల త్యాగాలు వృథా అవుతాయని పేర్కొన్నారు.  అలాగే కాంగ్రెస్‌ రాష్ట్ర విభజనను సక్రమంగా చేయకపోవడం వల్ల ఇప్పటికీ రెండు రాష్ట్రాల  మధ్య సమస్యలు అలాగే ఉన్నాయని, ఇద్దరూ పోట్లాడుకునే పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. అయితే ఈ సమస్యల పరిష్కారా నికి తామేం చేశామో ప్రధాని చెప్పలేకపోయారు. అయితే మోడీ పాలనపైనా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న కారణంగా ప్రజల్లో కూడా మోడీ ప్రచారంపై పెద్దగా స్పందన రావడం లేదు.  ఇదో రకంగా కాంగ్రెస్‌కు అనుకూలంగా మారింది. అటు కెసిఆర్‌, ఇటు మోడీల పాలనాతీరు కారణంగా కాంగ్రెస్‌ రొట్టె విరిగి నేతిలో పడ్డ చందంగా తయార య్యింది. ప్రజలు తమకు తెలియకుండానే కాంగ్రెస్‌ కూటమికి మద్దతు పలుకు తున్నారు. కోదండరామ్‌ కారణంగా కూడా తెలంగాణ ప్రజలు ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తున్నారు. ఓ రకంగా కాంగ్రెస్‌ పార్టీకి కోదంరామ్‌ సార్‌ ఆక్సిజన్‌ ఎక్కిస్తున్నారనే భావించాలి. స్తబ్ధుగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీలో నూతన ఆశలు చిగురించడానికి కెసిఆర్‌, మోదీల పానా విధానాలే కారణం. సోనియా గాంధీ సభ సక్సెస్‌ కావడం వల్ల లభించిన ఉత్సాహంతో కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారంలో దూసుకుని పోతున్నది.  ఇకపోతే చంద్రబాబు కాంగ్రెస్‌తో జతకట్టడం, తెలంగాణలో ప్రచారానికి రావడం వల్ల తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. మరోవైపు తెలంగాణ చరిత్రలోనే ఈ ఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా ఉండ బోతున్నాయి. ఎన్నికల కమిషన్‌ ధన ప్రభావంపై ఆంక్షలు విధిస్తున్నట్టు చెబుతున్నా, ఒక్కో అభ్యర్థీ కనీసం పది కోట్ల నుంచి గరిష్ఠంగా పాతిక నుంచి ముప్పై కోట్లు ఖర్చు చేస్తున్నారని సమాచారం. కోట్లు ఖర్చు చేసి ఎమ్మెల్యేగా గెలిచి ఎందుకు గెలవాలనుకుంటున్నారో అర్థంచేసుకోవచ్చు. ఇకపోతే వరుససభల ప్రచారం మొదలుపెట్టిన కెసిఆర్‌  చంద్రబాబును బూచిగా చూపించడం ద్వారా మరోమారు సెంటిమెంట్‌ను
రగిలిస్తున్నారు.  కెసిఆర్‌ తన ప్రచార సభల్లో చంద్రబాబును మళ్లీ రానిద్దామా అని సభికులను అడుగు తున్నప్పుడు స్పందన పెద్దగా కనిపించడం లేదు. ప్రచార సరళి తరవాత ప్రస్తుత ప్రభుత్వానికి మరో అవకాశం ఇవ్వడమా? ప్రతిపక్ష కూటమిని గద్దె నెక్కించడమా అన్నది ప్రజల చేతుల్లో ఉంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ప్రభావం కోస్తాఆంధ్ర మూలాలున్న ఓటర్లు ఉన్నచోట, తెలుగుదేశం బిసి ఓటర్లలో వేసిన ప్రభావం ఇంకా గణనీయంగా మిగిలింది. ప్రజాకూటమి కనుక అధికారంలోకి వస్తే తెలంగాణలో రాజకీయ సవిూకరణలే పూర్తిగా మారిపోతాయని అనుకోవడానికి లేదు. తెలంగాణ ప్రయోజనాలకు హానిచేసే సాహసం ఎవరూ చేయలేని పరిస్థితి ఉంటుందనడంలో సందేహం లేదు. కెసిఆర్‌ తెలుగుదేశంను కూడా ఒక ప్రతికూల శక్తిగా చేస్తున్న ప్రచారానికి తెలుగుదేశం పార్టీ గట్టి  సమాధానం ఇస్తూనే ఉంది. కేవలం చంద్రబాబును బూచిగా చూపినంత మాత్రాన కెసిఆర్‌ తన తప్పిదాలను కప్పిపుచ్చుకోలేరు. తెలంగాణలో నయా నిజాం పాలన తీసుకుని వచ్చి నిరంకుశ విధానాలను అవలంబిస్తున్న తీరుపై వస్తున్న విమర్శలకు ఆయన తన ప్రచారంలో ఎక్కడా సమాధానం చెప్పడం లేదు. అలాగే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన విమర్శలపైనా సమాధానం చెప్పడం లేదు. సచివాలయానికి ఎందుకు రారంటే సమాధానం లేదు. ఇచ్చిన హావిూలపై నిలదీస్తే సమాధానం/- రావడం లేదు. నిజంగానే ప్రజానాయకుడిగా ఉండాలనుకుంటే కెసిఆర్‌ వీటన్నింటికి సమాధానం చెప్పి తీరాలి. కేవలం కరెంట్‌ గురించి, కాళేశ్వరం గురించి చెబితే సరిపోదు. ఉద్యమ నాయకుడిగా ఆయన తీరు మారకుంటే ప్రజలు తప్పకుండా ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తారని గుర్తుంచుకోవాలి.

Other News

Comments are closed.