తెలంగాణ రాష్ట్రం 2014-15లో రాష్ట్రం యొక్క ఆదాయం 62 వేల కోట్లు ఉండగా, గత సంవత్సరానికి 1 లక్షా 84వేల కోట్లు వరకు పెరగడం జరిగింది.

share on facebook

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరం 2014-15లో రాష్ట్రం యొక్క ఆదాయం 62 వేల కోట్లు ఉండగా, గత సంవత్సరానికి 1 లక్షా 84వేల కోట్లు వరకు పెరగడం జరిగింది. అంటే ఏడేండ్లలోనే తెలంగాణ రాష్ట్రం మూడు రెట్ల వృద్ధిని సాధించి, దేశంలో అగ్రగామిగా నిలిచింది..అని ఆర్థిక శాఖ అధికారులు కేబినెట్ కు వివరించారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరం 2014-15లో రాష్ట్రం యొక్క ఆదాయం 62 వేల కోట్లు ఉండగా, గత సంవత్సరానికి 1 లక్షా 84వేల కోట్లు వరకు పెరగడం జరిగింది. అంటే ఏడేండ్లలోనే తెలంగాణ రాష్ట్రం మూడు రెట్ల వృద్ధిని సాధించి, దేశంలో అగ్రగామిగా నిలిచింది..అని ఆర్థిక శాఖ అధికారులు కేబినెట్ కు వివరించారు.
• ఐటీ రంగంలో గత సంవత్సరం తెలంగాణ  రాష్ట్రంలో 1 లక్షా 55 వేల మందికి కొత్తగా ఉద్యోగాలు కల్పించి, దేశంలో అగ్రగామిగా నిలిచిందని ఐటీ శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్ కేబినెట్ కు తెలిపారు.
• ఐటీ రంగంలో అగ్రగామిగా ఉన్న బెంగలూరు నగరంలో 1 లక్షా 48 వేల ఉద్యోగాలు కల్పన చేయగా, హైదరాబాద్ అంతకంటే ఎక్కువగా 1 లక్షా 55 వేల మందికి కొత్తగా ఉద్యోగాలు కల్పించడం జరిగిందని  ఐటీ అధికారులు వివరించారు.
• ఐటీ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రత్యేక విధానాలు, ఇన్సెంటివ్ లు, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీలు, మౌలిక వసతుల కల్పన, సుస్థిర శాంతిభద్రతలు, నిరంతరాయ నాణ్యమైన విద్యుత్ సరఫరా, మానవ వనుల లభ్యత వల్ల ఐటీ రంగం లో అభివృద్ది సాధ్యమైందని తెలిపారు.
• ఈ సందర్భంగా…రాష్ట్ర ఐటీరంగ అభివృద్ధిపై ముఖ్యమంత్రి గారు హర్షం వ్యక్తం చేశారు.
ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ను, ఐటీశాఖ ప్రత్యేక కార్యదర్శి జయేశ్ రంజన్ ను, ఇతర అధికారులను ప్రశంసించారు.

 

Other News

Comments are closed.