తెలుగు బోధనతో పెరగనున్న అవకాశాలు

share on facebook

ఇదో మహత్తర నిర్ణయమంటున్న భాషాభిమానులు
వరంగల్‌,మార్చి30(జ‌నంసాక్షి): బోధనలో తెలుగు తప్పనిసరి చేయడంతో తమిళనాడు రాష్ట్రం మాదిరిగానే తెలంగాణలోనూ మాతృబాష పట్ల పై పెరుగుతుందని పలుఉవరు భాషాభిమానులు అంటున్నారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వం, ప్రైవేట్‌ పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడాన్ని తెలుగు పండితులు, కవులు భాషాభిమానులు స్వాగతిస్తున్నారు. ఈ నిబంధన వల్ల తెలుగు పండితులకు ప్రాధాన్యం పెరుగుతుందన్నారు. ఈ విషయంలై తెలుగు పండితులు, కవులు భాషాభిమానులు పక్కాగా అమలు జరిగేలా విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలుగు తప్పనిసరితో భాషకు ప్రచారం జరుగుతుంది. మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలు మాతృభాషకు
ఎంతో ప్రాధాన్యతనిచ్చాయి. కార్యాలయ ఉత్తర ప్రత్యుత్తరాలు మాతృభాషలోనే కొనసాగిస్తున్నారు. అలాంటి పక్రియ తెలంగాణలో మొదలు కావడం అభినందనీయం. పది వరకు తెలుగును పక్కాగా అమలు చేయాలి. తెలుగు విద్యార్థులకు ఉన్నత విద్యా, ఉపాధిలో రిజర్వేషన్లు కేటాయిస్తే మరింత ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో తెలుగు తప్పనిసరి చేయడం  స్వాగతించాల్సిందే. తెలుగు తప్పనిసరితో తెలుగు భాషను బతికించుకోగలుగుతాం. దీని ద్వారా ప్రాచీన కళలు తెలుసుకోగలుగుతారు. తెలుగును రక్షించుకోవాలంటే ప్రసార మాధ్యమాలు సైతం ముందుకు రావాలి. భవిష్యత్తులో అమ్మ భాష బంగారు భాష కావాలని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో కృషి చేసిన డిప్యూటి సిఎం కడియం శ్రీహరి అభినందీనయుడని అన్నారు.  తెలుగు ప్రాధ్యాన్యత పెరిగి వివిధ పోటీ పరీక్షల్లో మన రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు అవకాశం పెరుగుతందన్నారు. మాతృ భాష పటిష్టంగా ఉంటేనే ఇతర భాషను నేర్చుకోవడానికి సులువుగా ఉంటుంది. తెలుగు భాషను తప్పనిసరిగా చేయడం హర్షణీయం. అన్ని పాఠశాలల్లో తెలుగును ప్రాథమిక విద్య నుంచే అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. పదోతరగతి వరకు తెలుగు భాషను తప్పనిసరి చేయడంతో సాహిత్యం పట్ల అభిరుచి పెరుగుతుంది. తెలుగు భాషాభివృద్ధికి దొహదపడుతుందని అన్నారు.

Other News

Comments are closed.