తెలుగు రాష్ట్రాల్లో.. 

share on facebook

నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు
అమరావతి, జులై20(జ‌నం సాక్షి) : ఒరిస్సా తీరంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖలోని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మరో 48 గంటలలో ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. తీరం వెంట గంటలకు 50 నుంచి 60 కివిూ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కోమరంభీం,  మంచిర్యాల, కామారెడ్డి, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, జైశంకర్‌ భూపాలపల్లి జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ  వర్షాలతో పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల  భారీవర్షాలతో పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో మూడు రోజుల పాటు తేలికపాటి
నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

Other News

Comments are closed.