తొలగించిన  హోంగార్డుల మెరుపు సమ్మె

share on facebook

కుటుంబాలతో రోడ్డుపై బైఠాయింపు

పెట్రోల్‌ బాటిల్‌తో ఒకరు హోర్డింగ్‌పై నిరసన

భారీగా ట్రాఫిక్‌ జామ్‌…ఉద్రిక్తత

హైదరాబాద్‌,మే14(జ‌నంసాక్షి ): ఉమ్మడి ఎపిలో తమను ఉద్యోగాల నుంచి అకారణంగా తొలగించినందున.. వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ కొందరు ¬ంగార్డులు కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్‌లో మెరుపు ఆందోళనకు దిగారు. ఉద్యోగం కోల్పోయిన ఓ ¬ంగార్డు ఖైరతాబాద్‌లో పెట్రోఎల్‌ సీసాతో హార్డింగ్‌పైకి ఎక్కడంతో ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. మరికొందరు తమ కుటుంబసభ్యులతో కలిసి రోడ్డుపై ఎండలో పిల్లలతో సహా బైఠాయించారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ భారీగా నిలిచిపోయింది. బురాన్‌గౌడ్‌ అనే ¬ంగార్డు ఖైరతాబాద్‌ చౌరస్తా సవిూపంలోని ¬ర్డింగ్‌ పైకి ఎక్కాడు. ఉమ్మడి రాష్ట్రంలో అర్డర్‌ కాపీలు లేవన్న కారణం చూపుతూ దాదాపు 400 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారని ¬ంగార్డులు వాపోయారు. యూనిఫామ్‌ ఇచ్చి… జీతాలు ఇస్తూ… గుర్తింపు కార్డులు ఉన్నా ఉద్యోగాల నుంచి ఎలా తొలగించారని వారు ప్రశ్నించారు. తొలగించిన ¬ంగార్డులను వెంటనే విధులలోకి తీసుకోవాంటూ గత మార్చిలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పినా ఇంత వరకు ఏ ఒక్క అధికారి స్పందించలేదని మండిపడ్డారు. తమకు స్పష్టమైన హావిూ ఇచ్చేవరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదని వారు స్పష్టం చేశారు. బలవంతంగా తమను ఇక్కడి నుంచి తరలిస్తే.. ఇంటికి వెళ్లి కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటామని ¬ంగార్డులు హెచ్చరించారు. తమకు న్యాయం చేయాలంటూ పెట్రోల్‌ బాటిల్‌ తో ¬ర్డింగ్‌ ఎక్కడంతో ఈ సంఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అకారణంగా వారిని విధుల నుంచి తొలగించడంపై ¬ంగార్డుల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ నగరంలోని ఖైరతాబాద్‌ ్గ//-ల ఓవర్‌ పక్కన ఉన్న ¬ర్డింగ్‌ దగ్గర నిరసన తెలుపుతున్నారు. మహబూబ్‌నగర్‌కు చెందిన బురాన్‌ గౌడ్‌ పెట్రోల్‌ బాటిల్‌ను తీసుకుని ¬ర్డింగ్‌ ఎక్కడంతో అక్కడ కలకలం రేగింది. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్‌ జామైంది. ఖైరతాబాద్‌ నుంచి నె/-లకెస్‌రోడ్డువైపు వెళ్లే మార్గాన్ని మొత్తం పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో ఆ వైపుగా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొద్ది గంటలుగా ట్రాఫిక్‌ ముందుకు కదలడం లేదు. అసలే సోమవారం.. ఆపై ఎప్పుడూ రద్దీగా ఉండే ఖైరతాబాద్‌ సర్కిల్‌ కావడంతో వేల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. అతన్ని కిందికి దించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

 

Other News

Comments are closed.