త్వరలోనే మేడ్చల్‌కు ఎంఎంటీఎస్‌

share on facebook

– సౌత్‌ రైల్వే సీఎం వినోద్‌కుమార్‌
మేడ్చల్‌, జనవరి25(జ‌నంసాక్షి) : ప్రయాణీకుల సౌకర్యార్థం రైల్వే స్టేషన్లను, ఫ్లాట్‌ ఫారాలను ఆధునీకరించి, నూతన ట్రాక్‌లను సైతం ఏర్పాటు చేస్తున్నామని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే జీఎం వినోద్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. సాధారణ పరిశీలనలో భాగంగా నాందేడ్‌ నుంచి సికింద్రాబాద్‌ వరకు రైల్వే స్టేషన్లను పరిశీలిస్తున్న ఆయన మేడ్చల్‌ రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్టేషన్‌ను పరిశీలించి అక్కడ నూతనంగా నిర్మించిన సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీర్‌ కార్యాలయం, ట్రాక్‌మెన్‌ టిఫిన్‌ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రయాణానికి సులువుగా ఉండేందుకు బ్రాడ్‌ గేజ్‌ పనులను చేపడుతున్నామని, అందులో భాగంగానే మేడ్చల్‌ వరకు రెండు లైన్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మేడ్చల్‌ వరకు కొనసాగుతున్న ఈ పనులు చివరి దశలో జరుగుతున్నాయని తెలిపారు. త్వరలోనే మేడ్చల్‌కు ఎంఎంటీఎస్‌ రైలును ప్రారంభిస్తామన్నారు. మేడ్చల్‌ రైల్వే స్టేషన్‌ను సైతం ఆధునీకరిస్తున్నామని, స్థానికుల కోరిక మేరకు మేడ్చల్‌లో ఆర్‌యూబీని ఏర్పాటు చేస్తామని హవిూ ఇచ్చారు.

Other News

Comments are closed.