దాసరికి ఘనంగా నివాళి

share on facebook

ఏలూరు,మే4(జ‌నంసాక్షి): ప్రముఖ సినిమా దర్శకులు దాసరి నారాయణరావు జన్మదినం సందర్భంగా.. శనివారం పాలకొల్లులోని దాసరి విగ్రహానికి మాజి మంత్రి చేగొండి హరి రామజోగయ్య పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా హరి రామజోగయ్య మాట్లాడుతూ.. దర్శకునిగా, నిర్మాతగా, నటుడిగా దాసరి నారాయణరావు గిన్నీస్‌ బుక్‌లో స్థానం సంపాదించి.. రాజకీయంగా కూడా ఎదిగి, ఎన్నో సేవలు చేశారని కొనియాడారు. పాలకొల్లు పేరు ప్రతిష్టలు ప్రపంచానికి తెలియజేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజి ఎంఎల్‌సి మేకా శేషుబాబు, పాలకొల్లు జనసేన అభ్యర్థి గున్నం నాగబాబు, డాక్టర్‌ కెఎస్‌పిఎన్‌ వర్మ, తదితరులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.