దేవాదులతో గొలుసుకట్టు చెరువులకు మహర్దశ

share on facebook

గోదావరి నీటితో పూర్తిగా నింపేలా చర్యలు

పది లక్షల ఆయకట్టు లక్ష్యంగా ప్రాజెక్ట్‌ పనులు

వరంగల్‌,జూలై25(జ‌నంసాక్షి): దేవాదుల ద్వారా జిల్లా మొత్తాన్ని సస్యశ్యామలం చేసేలా పథకం అమలు చేసేందుకు కార్యాచరణ సిద్దం అయ్యింది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో గోదావరి నీటితో చెరువులు నింపుతున్నారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతం అంతా ఇప్పుడు దేవాదుల కమాండ్‌ ఏరియా కిందికి

తెచ్చే బృహత్తర కార్యక్రమం కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాలకు నియోజకవర్గానికి లక్ష ఎకరాల చొప్పున సాగునీరు అందించాలనే లక్ష్యానికి అనుగుణంగా గొలుసుకట్టు చెరువుల్లో నీరు నింపి సాగునీటి సమస్యలు లేకుండా చేయబోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పానికి భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పర్యవేక్షణ, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రత్యేక దృష్టి తోడైంది.

వచ్చే సీజన్‌ రెండో పంట కాలానికి ఎలాగైనా లక్ష్యాన్ని చేరుకోవాలన్న సంకల్పం మేరకు ప్రాజెక్టు పనుల పురోగతి స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, మరోవైపు దేవాదుల ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా సాగుతున్నాయి. తుపాకులగూడెం, ఎస్సారెస్పీ మొదటి, రెండో దశ, మూడో దశ పనులు పురోగతిలో ఉన్నాయి. అన్నీ అనుకున్న ప్రకారం చేసేందుకు సాగునీటిపారుదల శాఖ అధికారులు అ¬రాత్రులు పనిచేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 18 చిన్న, పెద్ద రిజర్వాయర్లు పూర్తి కావచ్చాయి. రూ. 3220 కోట్లతో 10.78 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో లింగంపల్లి రిజర్వాయర్‌కు ప్రభుత్వం ఇటీవలే పరిపాలనాపరమైన అనుమతులు జారీ చేసింది. వచ్చేనెల ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ రిజర్వాయర్‌ పనులకు భూమి చేయబోతున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు ఇప్పటి వరకు ఇంతపెద్ద నీటినిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్‌ లేదు. లింగంపల్లి రిజర్వాయర్‌ ద్వారా వరంగల్‌ మహానగరపాలక సంస్థ పరిధిలోని సాగునీటి అవసరాలు తీర్చడం ఒక ఎత్తు అయితే ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం దేవాదుల కమాండ్‌ ఏరియగా మారిపోయే వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పది నియోజకవర్గాలకు పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బృహత్తర కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికగా కొనసాగుతోంది. దేవాదుల త్వరగా పూర్తిచేయడం ద్వారా ఏడాది పొడవునా నీటిని గోదావరి నుంచి లిఫ్ట్‌ చేయడం ద్వారా ఐదు పైప్‌లైన్లు ఐదు రోజులకు ఒక టీఎంసీ చొప్పున రిజర్వాయర్లు నింపుకోవడం నియోజకవర్గానికి లక్ష ఎకరాల చొప్పన పది గ్రావిూణ నియోజకవర్గాలకు 10 లక్షల ఎకరాలకు నీరు అందించాలనే సంకల్పంతో పనులు సాగుతుండడం విశేషం. స్టేషన్‌ఘన్‌పూర్‌, జనగామ, పాలకుర్తి నియోజకవర్గా ల్లో కొన్ని ప్రాంతాలు డ్రాట్‌ ఏరియాగా గుర్తించారు. వాటిలో 180 గ్రామాల్లోని చెరువులకు గతేడాది సాగునీరు ఇచ్చారు.

దేవాదుల ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులు దాదాపు తొలగిపోయాయి. మామునూర్‌, బొల్లికుంట తదితర ప్రాంతాలతోపాటు, జనగామ నియోజకవర్గంలో భూసేకరణ సమస్య ఉందని ప్రభుత్వం గుర్తించింది. ఏ జిల్లాకు ఆ జిల్లాగా రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులతో నిరంతరం సవిూక్షిస్తున్నారు. మంత్రి హరీశ్‌రావు రెండు, మూడు పర్యాయాలు సవిూక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెండు రోజుల క్రితం ఉన్నతస్థాయి సవిూక్ష నిర్వహించి ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరిని ఈ విషయంలో మరింత వేగం పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. రిజర్వాయర్‌ కింద ఎన్ని ఎకరాల సాగు విస్తీర్ణం,పంటల వివరాలు వంటి అంశాలను రూపొందించడంలో నీటిపారుదల శాఖ దృష్టి సారించింది. గోదావరి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులో భాగంగా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలంలోని లింగంపల్లి రిజర్వాయర్‌ నిర్మాణానికి రూ. 3220 కోట్ల రూపాయలతో ప్రభుత్వం ఇటీవల పరిపాలన అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు మూడు రోజుల్లో టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రిజర్వాయర్‌తో 10.78 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సౌలభ్యం ఏర్పడుతుంది. దేవాదుల, లింగంపల్లి, తుపాకులగూడెం ఇలా మొత్తం భారీ నీటిపారుదల శాఖ కింద రూ. 18,289 కోట్లు. అన్ని రిజర్వాయర్లు కలిపి 18 టీఎంసీల నీటినిల్వ అంచనా.

Other News

Comments are closed.