దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉంది

share on facebook

– నీ ఒక్కడి ఓటూ చరిత్రను మార్చగలదు
– జాతీయ ఓటరు దినోత్సవ వేడుకలో గవర్నర్‌ నర్సింహన్‌
హైదరాబాద్‌, జనవరి25(జ‌నంసాక్షి) : దేశ భవిష్యతు యువత చేతిలో ఉందని, ఓటు హక్కు ద్వారా దేశగతని మార్చవచ్చునని తెలుగు రాష్టాల్ర గవర్నర్‌ నర్సింహన్‌ అన్నారు. రవీంద్ర భారతిలో గురువారం జాతీయ ఓటరు దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు గవర్నర్‌ నరసింహన్‌, రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన గవర్నర్‌.. భారత ప్రజాస్వామ్యంలో ఎలక్షన్‌ కమిషన్‌ 5వ స్థంభమని కొనియాడారు. 18సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. ప్రతి ఎన్నికలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. యువత ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకోవాలన్న గవర్నర్‌.. దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందన్నారు. స్వేచ్ఛాయుత, శాంతియుత వాతావరణంలో
ఎన్నికలు జరగాలన్నారు. నువ్వొక్కడివి ఓటు వేయకపోతే వచ్చే నష్టమేవిూ ఉండదని అనుకోవద్దు.. నీ స్వరం వినిపించినా పెద్దగా ఉపయోగం ఉందని ఎవరైనా అంటే నమ్మవద్దు.. నీ ఒక్కడి ఓటూ చరిత్రను మార్చగలదు.. నీ స్వరం కొన్ని లక్షల మంది ఆలోచనల్ని ప్రభావితం చేయగలదు.. అని గవర్నర్‌ నరసింహన్‌ తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.

Other News

Comments are closed.