దోమతెరలతో మలేరియాకు చెక్‌

share on facebook

నిర్మల్‌,జనవరి9(జ‌నంసాక్షి ): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో దోమను నియంత్రించేందుకు ప్రభుత్వం
దోమతెరలు అందించిందని వైద్యాధికారులు తెలిపారు. జిల్లాకు సరఫరా చేసిన మారుమూల గ్రావిూణ ప్రాంతాల ప్రజలకు అందించామని అన్నారు. వీటిని ఉపయోగించుకవడంతో  పాటు అంటువ్యాధులకు దూరంగా పరిశుభ్రతలను పాటించాలని సూచించారు.  గ్రావిూణ ప్రాంత ప్రజలకు వాటి వినియోగం, వినియోగించే విధానంను క్లుప్తంగా వివరించారు. దోమతెరలు వినియోగిస్తే దోమలు  ధరిచేరవని వ్యాధుల నియంత్రణ కమిటీ సంచాలకులు అన్నారు. గ్రావిూణ ప్రాంత ప్రజలకు భారత ప్రభుత్వం అందించిన దోమతెరలను సద్వినియోగం చేసుకోవడంతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.  పాఠశాలల విద్యార్థులు ముఖ్యంగా హాస్టళ్లలో ఉంటున్నవారు వీటిని వినయోగించుకుని మలేరియా తదితర వ్యాధులకు దూరంగా ఉండాలన్నారు.  దోమ తెరలు అందించారా లేదా, వారికి వ్యాధులు వస్తే ఎలాంటి మందులు ఇస్తున్నారు అంటూ సంబందిత వైద్య సిబ్బందిని అడిగి తెలసుకుని వారి వద్ద ఉన్న మందులను పరిశీలించారు.  జ్వరాలు రావడానికి దోమలవ్యాప్తి , అపరిశుభ్రత అనే విషయాలపై విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించారు. దోమ తెరలు ప్రతీ విద్యార్థి వాడే విధంగా చూడాలని వైద్య సిబ్బందికి స్థానిక పాఠశాల ఉపాధ్యాయులకు సూచించారు.  గిరిజన గ్రామాల్లో జ్వరాలు వచ్చినపుడు వైద్యాధికారుల ప్రయత్నాలు ఎలా ఉన్నాయని జిల్లా వైద్యాధికారులను  అడిగితెలుసుకున్నారు. అఏజెన్సీలో మలేరియా, టైఫాయిడ్‌ జ్వరాలు తీవ్రతరం కావడానికి పారిశుధ్య లోపమే కారణమన్నారు. ప్రతి గిరిజన కుటుంబం ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండకుంటా చూడాలన్నారు.

Other News

Comments are closed.