ద్విచక్రవాహనం అదుపు తప్పి కిందపడిన స్పీకర్‌

share on facebook

ఎలాంటి ప్రమాదం లేదని స్వయంగా ప్రకటన
భూసాలపల్లి,ఆగస్ట్‌14(జ‌నంసాక్షి):  ప్లలె ప్రగతినిద్రలో భాగంగా పర్యటిస్తున్న స్పీకర్‌ సిరికొండ మధసూదనాచారి ద్విచక్రవాహనం(బు/-లలెట్‌)పై తిరుగుతున్న క్రమంలో అదుపుతప్పి కిందపడ్డారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో సోమవారం రాత్రి దళిత కాలనీలో స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి ప్లలె ప్రగతినిద్ర చేశారు. మంగళవారం ఉదయం ఎస్సీ, ఎస్టీ కాలనీలో పర్యటించిన అనంతరం ద్విచక్రవాహన ర్యాలీలో భాగంగా నూతన పంచాయతీగా ఏర్పడిన ఆరెప్లలె గ్రామానికి చేరుకున్నారు. వాహనంపై తిరుగుతూ మార్కెట్‌ గోదాంను పరిశీలించి అక్కడి మహిళలతో మాట్లాడి తిరిగి వస్తున్న క్రమంలో శాయంపేట శివారుకు చేరుకునే క్రమంలో మూలమలుపు వద్ద ఎడ్లబండి ఎదురుగా రావడంతో వెంటనే ద్విచక్రవాహనాన్ని స్పీకర్‌ మధుసూదనాచారి సీసీ రోడ్డు కిందకి దింపడంతో ఒక్కసారిగా జారి కిందపడిపోయారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, వెనక కూర్చున్న వ్యక్తిగత భద్రతా సిబ్బంది వాహనాన్ని పైకి లేపారు. ఈ సంఘటలో స్పీకర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. తనకేం కాలేదని, కంగారుపడ వద్దంటూ స్పీకర్‌ మధుసూదనాచారి తిరిగి అదే వాహనంపై శాయంపేటకు చేరుకున్నారు.

Other News

Comments are closed.