నకిలీ పత్రాలతో బ్యాంకుకు బురిడీ

share on facebook

ముగ్గురు సోదరుల అరెస్ట్‌
హైదరాబాద్‌,జూలై25(జ‌నంసాక్షి):  నకిలీ పత్రాలతో ఓ జాతీయ బ్యాంకును మోసం చేసి, రూ.5 కోట్ల రుణం తీసుకున్న కేసులో మరో ముగ్గురు నిందితులను సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. 2016లో ఈ కేసు నమోదు అయిన తరువాత.. ప్రధాన సూత్రధారి విమల్‌ గోయల్‌ను 2017లో అరెస్ట్‌ చేశారు. తాజాగా.. బోగస్‌ పత్రాలు సృష్టించిన బాలాపూర్‌కు చెందిన అన్నదమ్ములు బాబూరావు, ఇంద్రకరణ్‌, శ్రీకాంత్‌లను అరెస్ట్‌ చేశారు. అన్నదమ్ములు తమ పూర్వీకులకు సంబంధించిన భూమిని విక్రయించిన తరువాత, కొన్నవారి పేరుపై రెవెన్యూలో రికార్డు మారలేదు. దీన్ని ఆసరాగా చేసుకున్న ఈ ముగ్గురు విక్రయించిన భూమికే.. తిరిగి ఓ రెవెన్యూ ఉద్యోగి సహకారంతో నకిలీ పత్రాలు తయారు చేసి, వాటిని గోయల్‌కు విక్రయించారు. ఇదంతా గోయల్‌, బాబూరావు సోదరులు వేసుకున్న పథకంలోనే జరిగింది. ఈ పత్రాలను సెక్యూరిటీ సిండికేట్‌ బ్యాంకులో పెట్టి రెండు దఫాలుగా రూ.5 కోట్ల చొప్పున గోయల్‌ రుణం తీసుకున్నాడు. తీసుకున్న రుణానికి సంబంధించిన వాయిదాలు చెల్లించకపోవడంతో అనుమానం వచ్చిన బ్యాం కు అధికారులు దీనిపై ఆరా తీయడంతో బోగస్‌ పత్రాలతో బ్యాంకుకు బురిడీ కొట్టించారని నిర్దారించుకొని బ్యాంకు అధికారులు సీసీఎస్‌ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నకిలీ పత్రాలను పరిశీలించ కుండా, రుణాన్ని ఇవ్వడంలో న్యాయసలహాలు ఇచ్చిన లీగల్‌ అడ్వైజర్‌తో పాటు, సిండికేట్‌ బ్యాంకు డీజీఎంలతో పాటు మరో ముగ్గురికి నోటీసులు జారీ చేశారు. నకిలీ పత్రాలను సృష్టించిన ముగ్గురు సోదరులను తాజాగా ఈ కేసులో అరెస్ట్‌ చేశారు.

Other News

Comments are closed.